Perni Nani : ఛీ..అనిపిస్తున్న పేర్ని నాని వ్యాఖ్యలు
Perni Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన నోటికి పని చెప్పి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. అధికారంలో ఉన్నప్పటికే కాక, విపక్షంలో ఉన్నప్పుడు కూడా తన ధాటైన భాషతో విరుచుకుపడే నానీ, ఇటీవల పెడనలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. 76 ఏళ్ల చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ.. జగన్‌ను భూస్థాపితం చేయగలవా?
అని ప్రశ్నించిన నాని, టీడీపీ మహిళా వర్గాలపై తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై అభ్యంతరకర పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. అయ్యన్నపాత్రుడు 80 ఏళ్లు వచ్చినా చావలేదంటూ స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆయన్ను దూషించారు. కొల్లు రవీంద్రను సొల్లు రవీంద్రగా పేర్కొంటూ.. అన్నం కాకుండా బ్రాందీ షాపుల్లో కమీషన్లు తింటున్నాడన్నారు. కొల్లు రవీంద్ర 45 ఎకరాలు అక్రమించారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వ్యాఖ్యానించారు. ‘‘ఓరేయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినటం లేదు.
Perni Nani : ఛీ..అనిపిస్తున్న పేర్ని నాని వ్యాఖ్యలు
సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినటం లేదు. బందరు బీచ్ లో ఇసుక తింటున్నావు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయిలు లేదు. కానీ.. ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు డబ్బులు ఎక్కడివి? ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినటం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం నింపుతుండగా..వైసీపీ శ్రేణులు సైతం ఈ వ్యాఖ్యలపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఈ వయసులో అలాంటి వ్యాఖ్యలు ఏంటి..? అధికార కూటమి నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారు ఊరుకుంటారా..? వంశీ కి పట్టిన గతే నానికి పట్టడం ఖాయమని మాట్లాడుకుంటున్నారు.