Chandra Babu Naidu : రేవంత్ రెడ్డి గెలుపు పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
ప్రధానాంశాలు:
Chandra Babu Naidu : రేవంత్ రెడ్డి గెలుపు పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
Chandra Babu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తీర్థయాత్రలలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని , విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు ఈరోజు ఉదయం సింహాచలా అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి దక్కని గౌరవం నాకు లభించింది. 70, 80 దేశాలలో నాకోసం రోడ్డుమీదికి వచ్చి నిరసనకు దిగారు. తెలుగు రాష్ట్రాలలో విరోచితంగా మాట్లాడారు. దేశమంతా కూడా పోరాడారు ఎక్కడికక్కడ పూజలుమ, ఆందోళనలు చేశారు. నిరసనలు చేశారు. వారు చూపిన సంఘీభావం నేను ఎప్పటికీ మర్చిపోను. నా జీవితం చరితార్థం అయింది. అదే సమయంలో నాకు బాధ్యత ఉంది. మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈ జనాలను కాపాడే శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వమని నరసింహ స్వామిని కోరుకుంటున్నాను అని అన్నారు.
తనను ఈరోజు ఎంతగా అభిమానిస్తున్నారో, ఆశిస్తున్నారో అందరూ కూడా కలిసి ముందుకు నడవాలి. భావితరాల భవిష్యత్తును కూడా ఆలోచించాలి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఎన్నికలు గురించి చెప్పండి అని రిపోర్టర్ అడగగా ఇక్కడ రాజకీయాలు మాట్లాడను అని ఆయన చెప్పారు. ఇక టిడిపి అధికారంలోకి రాగానే పంచ గ్రామాల భూములను సమస్యలను పరిష్కరిస్తాం అని అన్నారు. ధర్మక్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు రాజకీయం గురించి మాట్లాడాలంటే విమర్శలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడాను. రాష్ట్రంలో ధర్మం నీతి లేదు ధర్మ పరిరక్షణ కోసం నరసింహ స్వామి దర్శించుకున్నాను అని ఆయన అన్నారు.
కష్టాల్లో ఉన్నప్పుడు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగి నా కోసం వేడుకున్నారు. ఇవన్నీ ధర్మాన్ని కాపాడడానికే కదా అని అన్నారు. ఇక ఈరోజు సింహాచలం అప్పన్న దర్శించుకున్న చంద్రబాబు ఈ నెల 5 న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోబోతున్నారు. ఈ తీర్థయాత్రలు ముగిసాగా పూర్తిగా రాజకీయా కార్యక్రమాల్లో పాల్గొంటారని టిడిపి నేతలు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు బెయిల్ వచ్చిన అనంతరం శ్రీవారి దర్శనానికి వెళతారు అనుకున్నారు. కానీ అప్పుడు సాధ్యపడకపోవడంతో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు తీర్థయాత్రలు ప్రారంభించారు. పొలిటికల్ యాత్రలు ప్రారంభించే ముందుగా ఆయన అందరి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు అని తెలుస్తుంది.