Chandrababu Arrest : చంద్రబాబుకు మరో షాక్.. బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా
Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి. పలు స్కామ్ లలో ఆయన పేరును సీఐడీ అధికారులు చేర్చారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ముందు ఆయన పేరును చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయన రిమాండ్ పొడిగిస్తూ వెళ్తున్నారు కానీ.. ఇప్పటి వరకు ఆయన రిమాండ్ పూర్తి కాలేదు. మరోవైపు తనపై […]
Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి. పలు స్కామ్ లలో ఆయన పేరును సీఐడీ అధికారులు చేర్చారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ముందు ఆయన పేరును చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయన రిమాండ్ పొడిగిస్తూ వెళ్తున్నారు కానీ.. ఇప్పటి వరకు ఆయన రిమాండ్ పూర్తి కాలేదు. మరోవైపు తనపై మోపిన అభియోగాలపై, పలు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు అప్పీల్ చేసుకున్నా కూడా ఆయనకు ముందస్తు బెయిల్ మాత్రం కోర్టులు మంజూరు చేయడం లేదు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కూడా చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన విచారణ ఏపీ హైకోర్టులో సాగుతోంది. తాజాగా ఈ పిటిషన్ పై చంద్రబాబు తరుపు లాయర్లు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వెంటనే విచారణ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయినా కూడా ఈ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే ఏసీబీ కోర్టు కొట్టేయడంతో.. ఏపీ హైకోర్టులో ఆ తీర్పును చంద్రబాబు తరుపు లాయర్లు సవాల్ చేశారు. ఈనెల 12న బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా విచారణ ప్రారంభం కాలేదు. ఇవాళ విచారణ జరగాల్సి ఉన్నా.. ఆధారాలు సమర్పించేందుకు చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు ఇంకా సమయం కావాలని కోరారు. దీంతో చంద్రబాబు విచారణను ఈనెల 19కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబును గత నెల సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబును సీఐడీ అధికారులు జైలులోనే విచారిస్తున్నారు.