
chandrababu first speech after release from rajahmundry central jail
Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పై తాజాగా విడుదలయ్యారు. అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబుకు 4 వారాల మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు ఇచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి సాయంత్రం విడుదల చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు బయటికి వచ్చి తన అభిమానులతో మాట్లాడారు. చంద్రబాబు విడుదల అవుతున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం పెట్టారు. అభినందనలు తెలియజేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదికి వచ్చి నాకోసం మీరు సంఘీభావాన్ని తెలిపారు. పూజలు చేశారు. నాకోసం ప్రార్థనలు చేశారు. మీ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకోసం రోడ్డు మీదికి వచ్చి సంఘీభావాన్ని తెలిపారన్నారు చంద్రబాబు.
మీరు చూపించిన అభిమానం ఎనలేనిది. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు చూపించారు. ఆరోజు నేను చూసిన పనులు సమాజానికి, మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, ఉపయోగపడిన వాళ్లంతా రోడ్డు మీదికి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావం పలికారు. ప్రపంచం మొత్తం నేను ఆరోజు చేపట్టిన విధానాల వల్ల లాభం పొందిన ప్రతి ఒక్కరు రోడ్డు మీదికి వచ్చారు. నా జీవితం ధన్యం అయింది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి రాదు. 45 ఏళ్ల సుదీర్ఘ నా రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చేయలేదు.. నేను ఏ తప్పు చేయలేను. అది నా నిబద్ధత. మరొక్కసారి రాష్ట్రంలో ఉండే.. ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ, విదేశాల్లో ఉన్న వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందలు అని చెప్పుకొచ్చారు.
అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని తెలియజేశాయి. వాటికి కూడా అభినందనలు. ఒక పక్క నాయకులు, మరో పక్క పార్టీలు నాకు పూర్తిగా సహకరించాయి. వాళ్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేకంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు. బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కూడా నాకు సంఘీభావాన్ని తెలియజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదికి వచ్చారు. 52 రోజులుగా నిరవధికంగా ఏమాత్రం అధైర్య పడకుండా పోరాడారు. కొందరు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు నాకోసం సైకిల్ యాత్ర చేశారు. హైదరాబాద్ లో మొన్న ఐటీ ప్రొఫెషనల్స్ పెద్ద ఎత్తున్న సంఘీభావం కోసం స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరినీ పేరు పేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను 45 ఏళ్లుగా కష్టపడ్డ విషయాలను ఈ 52 రోజులు నెమరు వేసుకున్నారు. నాకు సపోర్ట్ చేసిన మీడియాకు కూడా ధన్యవాదాలు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.