congress shock to sabitha indra reddy in maheshwaram
Sabitha Indra Reddy : సబితా ఇంద్రారెడ్డి తెలుసు కదా. తెలంగాణ విద్యా శాఖ మంత్రి. మహేశ్వరం నియోజకవర్గం తన అడ్డా. అక్కడ సబితా ఇంద్రారెడ్డికి ఉన్న పాపులారిటీ మామూల్ది కాదు. అందుకే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేర్చుకొని మరీ సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి పదవి కూడా వచ్చింది. మళ్లీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం టికెట్ కేటాయించింది. ఈసారి ఎన్నికలు చాలా టఫ్ కాబోతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థులను అయితే నిలుపుతుందో.. వాళ్లకు తగ్గట్టుగా.. గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ దీటైన నాయకులను బరిలోకి దించుతోంది. గజ్వేల్, కామారెడ్డి లాంటి నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ వదలడం లేదు అంటే.. కాంగ్రెస్ ఈసారి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నది ఎవరో కాదు.. బీఆర్ఎస్ నుంచి సబితా రెడ్డి పోటీ చేస్తున్నారు. సబితా రెడ్డికి మహేశ్వరంలో ఉన్న బలం అందరికీ తెలుసు. అలాంటి నియోజకవర్గంలో సబితను ఓడించాలంటే ఖచ్చితంగా ఆమెకు దీటైన నేతనే తీసుకురావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్లాన్ వేసింది. మహేశ్వరంలో అసలైన సిసలైన నాయకుడిని బరిలోకి దించుతోంది. ఆ నేత కనుక మహేశ్వరం నుంచి పోటీ చేస్తే సబితా ఇంద్రారెడ్డి కూడా తట్టా బుట్టా సర్దుకొని పోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అక్కడ పోటీ. ఇప్పటికే సబితా రెడ్డికి వ్యతిరేకంగా ఆ నేత ఒకప్పుడు పోటీ చేసిన వ్యక్తే. ఇప్పుడు కాదు రెండు దశాబ్దాల కిందనే సబితకు అసలైన పోటీ ఇచ్చిన ఆ నేత మళ్లీ 2023 ఎన్నికల్లో సబితకు పోటీగా బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన 23 ఏళ్ల కిందనే సబితారెడ్డికి పోటీగా ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికే కాంగ్రెస్ పెద్దలు లక్ష్మారెడ్డిని ఢిల్లీకి పిలిచారట. 2000 లో జరిగిన ఉపఎన్నికల్లో ఇంద్రారెడ్డి స్థానంలో సబితా రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చేవెళ్లి నుంచి సబితారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొన్నది. సబితా రెడ్డి గెలిచినా కూడా లక్ష్మారెడ్డి అప్పట్లోనే ఆమెకు గట్టి పోటీనిచ్చారు. అందుకే మరోసారి సబితా రెడ్డిని ఢీకొట్టడానికి లక్ష్మారెడ్డి అయితేనే కరెక్ట్ అని భావించి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నుంచి లక్ష్మారెడ్డిని బరిలోకి దించుతోంది. చూడాలి మరి.. మహేశ్వరంలో ఎవరు నెగ్గబోతున్నారో?
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.