Home » Andhra Pradesh » Government Lawyer Reveals Facts About Chandrababu Arrest
andhra pradesh

Chandrababu Bail : చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని సంబురపడకండి.. బెయిల్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ప్రభుత్వం తరుపు లాయర్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: October 31, 2023 6:58 pm
Advertisement

Chandrababu Bail : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ సాయంత్రం చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు రాజమండ్రి జైలు బయట తొలిసారి మాట్లాడారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ విషయంపై ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు రూ.371 కోట్లు దోపిడికి గురయిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు వెళ్లాయి. దొంగ బిల్లులు సబ్మిట్ చేసి, ఫేక్ ఇన్ వాయిస్ క్రియేట్ చేసి రూ.371 కోట్లు కొల్లగొట్టారు అని తేలింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజా సంక్షేమానికి వాడాల్సిన డబ్బు అది. దోపిడికి గురయినప్పుడు ఆ ప్రభుత్వం స్పందించలేదు. దీనికి మూలం గత ప్రభుత్వ పెద్దలే కాబట్టి దాన్ని ఖాతరు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.371 కోట్లు ప్రజలకు చెందాల్సిన డబ్బు.. ఒక వర్గం చేతుల్లోకి డబ్బులు వెళ్లిపోయి.. దోపిడికి గురయింది కాబట్టి ఈ ప్రభుత్వం దీని పూర్వాపరాలు విచారించాలని భావించింది.

Advertisement

ఈ ప్రభుత్వం వచ్చాక అధికారులు విచారణ చేపట్టారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 90 శాతం ఫ్రీగా జర్మన్ కంపెనీ ఇస్తున్నట్టుగా ఉంది. అందులో రూ.371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెట్టుకున్నట్టుగా ఉంది. ఎంఓయూ కూడా చేశారు కానీ.. అందులో ఎలాంటి సిగ్నేచర్స్ లేవు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఖాతా కిందనే రూ.371 కోట్లు పెట్టేలా ఉంది. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. వాళ్లు 90 శాతం తీసుకురాలేదు. భూమి మీద ప్రాజెక్టు క్రియేట్ చేసి వాళ్లు 90 శాతం పెట్టుబడి పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. అయినా కూడా ఫైనాన్స్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము రిలీజ్ చేశామని నోట్ ఫైల్ రాశారు. ఇప్పటికే అందులో 36 మందిని అరెస్ట్ చేశారు. అందులో కొందరికి బెయిల్ కూడా వచ్చింది. అప్పటి సీఎంను 37వ ముద్దాయిగా చేర్చారు.

Chandrababu Bail : బెయిల్ వచ్చినా మళ్లీ సరెండర్ కావాల్సిందే

ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది కానీ.. అది ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు మళ్లీ సరెండర్ కావాల్సిందే. నాలుగు వారాల తర్వాత సరెండర్ కావాలి. బెయిల్ మధ్యంతరంగా ఇచ్చింది మాత్రమే. ప్రధాన బెయిల్ మీద నవంబర్ 10న విచారణ జరగనుంది. కోర్టు వారి నిర్ణయాన్ని అందరం పాటిస్తాం అని చంద్రబాబు బెయిల్ పై లాయర్ చెప్పుకొచ్చారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి