Chandrababu : చంద్రబాబు సరికొత్త నిర్ణయం.. జగన్ తెచ్చిన జీఓని పక్కన పడేయడంతో అందరు హర్షం..!
Chandrababu : కూటమి ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు చేసి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అధికారులు చర్చలు జరిపారు.
ప్రతి మేజర్ పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన నియమాలపై ఉపాధ్యయ సంఘాలతో చర్చించారు. 3, 4, 5 తరగతులను గత ప్రభుత్వంలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిగే ఇబ్బందులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలోనూ ఒక మోడల్ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాప్‌లను వీలైనంత వరకు సులభంగా ఉండేలా, ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.
Chandrababu : చంద్రబాబు సరికొత్త నిర్ణయం.. జగన్ తెచ్చిన జీఓని పక్కన పడేయడంతో అందరు హర్షం..!
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తోందని.. హామీల అమలు ఏమైందంటూ వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగ యువతకు, రైతులకు ఇలా అందరికీ హామీలు ఇచ్చారని.. ఇప్పుడం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే తాము అధికారంలో ఉండి ఉంటే.. ఇప్పటికే రైతుభరోసా, చేయూత, అమ్మ ఒడి ఇలా.. అన్ని పథకాలు ఇప్పటికే అమలు చేసి ఉండేవారమని చెప్తున్నారు. టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని.. సూపర్ సిక్స్ కాదు అవుట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.