Chandrababu : చంద్రబాబుకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబుకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :22 September 2023,11:24 am

Chandrababu : చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రిమాండ్ ను ఇంకా పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 24 వరకు అంటే ఇంకో మూడు రోజులు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. నిజానికి.. ఆయన జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. కానీ.. ఆ రిమాండ్ ను పెంచాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై వర్చువల్ గా విచారణ జరుగుతోంది. తాజాగా ఆయన రిమాండ్ పై కోర్టు నిర్ణయం తీసుకొని మరో మూడు రోజులు పెంచారు.

chandrababu in remand till 24 september

#image_title

సీఐడీ కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని కూడా కోర్టు అడిగి తెలుసుకుంది. దీంతో తనను కావాలని స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని.. అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జికి తెలిపారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే అని తనను అందుకే అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జి ఎదుట ఆరోపించారు. అయినా కూడా చంద్రబాబు రిమాండ్ ను కోర్టు పొడిగించింది.

Chandrababu : సీఐడీ కస్టడీ పిటిషన్ పైనా తీర్పు

ఇక.. సీఐడీ కస్టడీ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు త్వరలో తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు అధికారులు చంద్రబాబును ప్రవేశపెట్టారు. నేను చేయని తప్పుకి నన్ను అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే నన్ను అరెస్ట్ చేశారు.. అంటూ చంద్రబాబు తన బాధ చెప్పుకోగా.. మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో లేరు. మీ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి అవి తేలేవరకు జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉంటారు అని జడ్జి చంద్రబాబుకు స్పష్టం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది