Jagan: జగన్ కు చంద్రబాబు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడట ..ఇది విన్నారా !

Ys Jagan : జగన్ కు చంద్రబాబు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడట..!

 Authored By sudheer | The Telugu News | Updated on :22 January 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : జగన్ కు చంద్రబాబు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడట..!

Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ముదిరింది. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సీఎం హోదాలో ఉండి అబద్ధాలు ఆడుతున్నారని, వయసులో తనకంటే పెద్దవారైనప్పటికీ రాజకీయంగా తనతో పోటీ పడలేక తాను చేసిన అభివృద్ధి పనులకు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ తండ్రి వైఎస్సార్ మరియు చంద్రబాబు సమకాలికులని గుర్తు చేస్తూ, తన రాజకీయ ఆలోచనలతో చంద్రబాబు తలపడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

Ys Jagan జగన్ కు చంద్రబాబు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడట

Ys Jagan : జగన్ కు చంద్రబాబు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడట..!

అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ దాడుల అంశంపై జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు నాయుడు ‘విషబీజాలు’ నాటుతున్నారని, ఇవి భవిష్యత్తులో పెరిగి పెద్దవై నియంత్రించలేని పరిస్థితులకు దారితీస్తాయని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వెళ్ళిపోయేలా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా హింసాత్మక రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటని, పాలకులైన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

Ys Jagan నేను చేసిన దానికి కూడా ఆయనే క్రెడిట్ తీసుకుంటున్నాడు

పోలీసు యంత్రాంగం మరియు స్థానిక ఎమ్మెల్యేల తీరును కూడా జగన్ తప్పుబట్టారు. వైసీపీ కార్యకర్తలను చంపేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఈ దాడులకు బాధితులైన కుటుంబాలు భవిష్యత్తులో ప్రతిస్పందిస్తే ఆ పరిణామాలకు చంద్రబాబు మరియు ఆయన ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూనే, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు యువకుడిలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పరుగులు తీస్తుంటే జగన్ ఇలా కామెంట్స్ చేయడం ఆయనకే చెల్లుతుందని కామెంట్స్ వేస్తున్నారు.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది