
Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. బాబు అర్ధం పరమార్ధం అదేనా..?
Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిసారి చెబుతున్నారు. వైసీపీని గద్దె దింపడం కోసం జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఐతే టీడీపీ ఒంటరిగా చేసుంటే ఫలితం ఎలా ఉండేదో కానీ కూటమికి మంచి ఆధ్యక్యత వచ్చింది. ఐతే తోడుగా వచ్చిన జనసేన కూడా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చికోవడంతో ఇదంతా వారి ఎఫెక్ట్ అనుకున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బాగా ఉంది. టీడీపీ, జనసేనకు సపోర్ట్ గా బీజేపీ కూడా ఏపీలో అధికారం చేపట్టేందుకు కృషి చేసింది. ఇదిలాఉంటే ఏపీలో బాబు ఏ మీటింగ్ పెట్టినా సరే ఇక్కడ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని గుర్తు చేస్తున్నారు. దీని వెనుక రీజన్ ఏపీలో ఉన్న సమస్యలే అని తెలుస్తుంది.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది. ఐతే ఈసారి కేంద్రంలో కూడా కీలకంగా మారడంతో ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత కూడా బీజేపీ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ సంగతి ఏమో కానీ ఏపీ అభివృద్ధికి కావాల్సిన ఆర్ధిక అవసరాలకు కేంద్రం సపోర్ట్ చేసేలా పావులు కదిలిస్తున్నారు. క్యాపిటల్ గా అమరావతికి పెట్టుబడులు తీసుకు రావడం, రోడ్లు బాగు చేయడం, పోలవరం ప్రాజెక్ట్ ఇలా అన్నిట్లో ఏపీ వెనకపడి ఉంది. దీన్ని బాగు చేయాలంటే సరైన ఆర్ధిక వెసులుబాటు అవసరం.
Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. బాబు అర్ధం పరమార్ధం అదేనా..?
అందుకే బాబు ఇక్కడ ఉంది కేవలం టీడీపీ ప్రభుత్వమే కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని పదే పదే చెబుతున్నారు. ఎందుకంటే ఏపీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం తీసుకోవాలని అలా చెబుతున్నారు. అంతేకాదు ఇదివరకు సీఎం గా చేసినప్పుడు ఎంతో హుషారుగా కనిపించే బాబు ఇప్పుడు ఏపీ పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందుతున్నారు. ఐతే ఏపీకి కేంద్రం సపోర్ట్ ఉంటేనే ఏమైనా చేయగలం అనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఏపీలో ఉందని పదే పదే గుర్తు చేస్తున్నారు చంద్రబాబు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.