Raghurama : అమ్మ రఘురామ.. పెద్ద స్కెచ్ తోనే చంద్రబాబుని కలిసావుగా..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: June 5, 2023, 1:00 pm

Raghurama: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుకాగానే వెంటనే ఢిల్లీకి చెక్కేశారు. ఇక్కడ వర్కవుట్ కాక ఏకంగా ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. ఒక్క వైసీపీ పార్టీని ఓడించడం కోసం అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఒక ఏడాది సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు చంద్రబాబు. అప్పుడే మేనిఫెస్టో కూడా ప్రకటించారు. సంవత్సరం ముందే మేనిఫెస్టో కూడా ప్రకటించడం పక్కన పెడితే అన్నీ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే అవి.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను అప్పట్లో తిట్టిపోసిన అదే చంద్రబాబు ఇప్పుడు పేర్లు మార్చి అవే సంక్షేమ పథకాలను ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజలే కాదు.. తన సొంత పార్టీ టీడీపీ నేతలే షాక్ అయ్యారు. ఇదేం విడ్డూరం అంటూ తమ పార్టీ అధినేతపైనే మండిపడ్డారు. చంద్రబాబు పార్టీ పరువును గంగలో కలుపుతున్నారని బాధపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ మంతనాలు జరుపుతున్నారు. ఒంటరిగా ఏపీలో పోటీ చేసే దమ్ము లేక బీజేపీతో జతకట్టేందుకు తెగ పావులు కదుపుతున్నారు. బేరాలు ఆడుతున్నారు.వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ద్వారా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ నడిపించాలని భావిస్తున్నారు. కేవలం కోవర్టులా పనిచేసేందుకు రఘురామ వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు.

chandrababu master plan with raghuramaraju

chandrababu master plan with raghuramaraju

Raghurama : రఘురామకృష్ణంరాజు ద్వారా మాస్టర్ గేమ్ ప్లాన్ వేసిన చంద్రబాబు

ఇప్పుడు చంద్రబాబును కీర్తిస్తూ ఆయన భజన చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఎద్దేవా చేయడం, దానికి సంబంధించిన వీడియోలు చేయడం, ఢిల్లీలోనే మకాం వేసి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్ పై బురద జల్లడం, పనిలో పనిగా చంద్రబాబును మెచ్చుకోవడం, ఆయన భజనం చేయడం.. ఇదే కదా రఘురామ పని. ఇప్పుడు చంద్రబాబు, రఘురామ ఇద్దరూ కలిసి కేంద్రంలో బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు. ఏం చేసినా ఏం లాభం. ఒక్క వైసీపీ పార్టీని ఓడించడం కోసం.. ఇలా పొత్తుల కోసం పాకులాడుతున్న చంద్రబాబు నైతికంగా మరోసారి ఓడినట్టే లెక్క.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp