Chandrababu : చంద్రబాబు పద్ధతి కొత్తగా ఉందే.. ప్రజల్లో ప్రశంసలు..!
ప్రధానాంశాలు:
మారిన చంద్రబాబు.. అందరిలో ఆశ్చర్యం
మారిన చంద్రబాబు తీరుపై ప్రజల్లో ప్రశంసలు..!
Chandrababu : చంద్రబాబు పద్ధతి కొత్తగా ఉందే.. ప్రజల్లో ప్రశంసలు..!
Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన రాజకీయ తీరును కొత్తదిగా తీర్చిద్దుకుంటున్నారు. గతంలో పరిపాలనలో సాంకేతికత, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆయన, ఇప్పుడు ప్రజల మౌలిక అవసరాలు, వారి వృత్తిపరమైన జీవన విధానాలపైనా దృష్టిసారిస్తున్నారు. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడి స్థానికులను నేరుగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవడం, వారికి అవసరమైన సదుపాయాలపై ఆరా తీసి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం ఆయన నూతన పాలనా శైలిలో భాగమైంది.

Chandrababu : చంద్రబాబు పద్ధతి కొత్తగా ఉందే.. ప్రజల్లో ప్రశంసలు..!
Chandrababu : చంద్రబాబు ఇది మీరేనా..? అని ఆశ్చర్యపోతున్న ప్రజలు.. ఎందుకంటే
ఇటీవల ఆయన చేపట్టిన పర్యటనలు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు. బైక్ మెకానిక్, చెప్పులు కుట్టే వారు, మృత్యుకార కుటుంబాలు వంటి చిన్న వర్గాలకు చెందిన వారిని నేరుగా కలవడం ద్వారా వారికి ప్రభుత్వం అండగా ఉందని తెలియజేశారు. ఇందువల్ల ఆ వర్గాల్లో భరోసా, సానుభూతి ఏర్పడుతోంది. ప్రజల జీవనశైలిని నెరపుతూ, వారి కష్టాలను నేరుగా అనుభవించడం ద్వారా చంద్రబాబు, పరిపాలనకు మానవతావాద కోణాన్ని జత చేశారు.
తాజాగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయం ప్రధాన అర్చకులతో మాట్లాడుతూ ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, అవసరాలపై ఆయన చర్చించారు. ఇది ఆయన పాలనలో సంస్కృతి, సంప్రదాయాలకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి నూతన విధానంతో ప్రజలలోకి మక్కువను తీసుకువచ్చే విధంగా ఉంది. ఒకటిగా అన్ని వర్గాల మనసులను గెలుచుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ పాలన సాగిస్తున్న చంద్రబాబు తన శైలిలో స్పష్టమైన మార్పును చూపిస్తున్నారు.