Chandrababu Naidu : నువ్వు మీ అన్న కొట్టుకొని .. నన్ను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని విడదీయాలని చూస్తున్నావా… వైయస్ షర్మిలపై చంద్రబాబు నాయుడు కామెంట్స్..!!
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది.భీమిలిలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ‘ రా కదలిరా ‘ సభలో వైఎస్ జగన్ ప్రసంగానికి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు.వైయస్ జగన్ ఆయన చెల్లి కొట్టుకుంటే దానికి కారణం నేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. అతడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లంతా నాకు స్టార్ క్యాంపెయినర్లని అంటున్నాడని, నిజానికి అతడి వల్ల అన్యాయం జరిగిన వారంతా నాకు స్టార్ క్యాంపెయ్యనర్లే అని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, యువత వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు.
భీమిలి సభలో సీఎం వైఎస్ జగన్ ఓటమి ఖాయమని తెలిసిందని వైయస్ జగన్ మాటలో తేడా కనిపిస్తుందని చెప్పారు. మొన్నటిదాకా గెలుపు ధీమా వ్యక్తం చేయగా ఇప్పుడు ఓటమి ఖాయమని వైయస్ జగన్ భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన పనులు, పెట్టిన ఇబ్బందులకు వైఎస్ జగన్ ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గర పడ్డాయి అని పేర్కొన్నారు. ఏపీకి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉందన్నారు. భీమిలి సిద్ధం అనే సమావేశం పెట్టారు. సిద్ధం అని నువ్వు అనడం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
వైయస్ జగన్ పాలనలో ప్రతిరంగం దెబ్బతిన్నదని ఆరోపించారు. ఎక్కడైనా మంచి రోడ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నష్టపోని వ్యక్తి లేడని విమర్శించారు. జగన్ పాలనలో తెలుగు జాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువ అని, ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేదే తన జీవిత లక్ష్యం అని చంద్రబాబు నాయుడు తెలిపారు. హంద్రీ, నీవా వంటి ఎన్నో నీటి ప్రాజెక్టులను టీడీపీ హయాంలో ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు మనవే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ తెచ్చిన భూ రక్షణ చట్టం భక్షణగా మారిందని తాము అధికారంలోకి వస్తే భూ రక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.