Chandrababu Naidu : రైతులకు భారీ శుభవార్త తెలిపిన చంద్రబాబు..!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : రైతులకు భారీ శుభవార్త తెలిపిన చంద్రబాబు..!
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న “అన్నదాత సుఖీభవ” పథకాన్ని Annadata Sukhibhava Scheme ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి కీలక వివరాలు వెల్లడించారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు.

Chandrababu Naidu : రైతులకు భారీ శుభవార్త తెలిపిన చంద్రబాబు..!
Chandrababu Naidu : రైతుల ఎదురుచూపులు చంద్రబాబు తెరదించారు
జూన్ 12 న కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. అన్నదాతలకు సంవత్సరానికి రూ. 20,000 నేరుగా ఖాతాలో జమ చేయనున్న ఈ పథకం రైతులకు ఆర్థికంగా సహాయపడనుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం రైతాంగానికి పెద్ద దీవెనగా మారబోతుంది. రైతుల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు స్పష్టంచేశారు. మహానాడు నిర్వహణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18 లోపు రాష్ట్ర మినహా అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని, మహానాడు అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీలను వేయనున్నట్లు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు, పింఛన్లు, విద్యార్థుల కోసం “తల్లికి వందనం”, గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయ నియామకాలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయాన్ని గుర్తుచేసారు.