Chandrababu Naidu : ఎన్టీఆర్ పై వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్న బాబు.. అధికారం కోసమేనా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu Naidu : ఎన్టీఆర్ పై వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్న బాబు.. అధికారం కోసమేనా ..?

Chandrababu Naidu : చంద్రబాబు నాయుడుది వెన్నుపోటు రాజకీయం అని అందరూ అంటుంటారు. కానీ ఆయన దానిని ఏం మాత్రం పట్టించుకోరు. రాజకీయంగా ఎదిగేందుకు ఎంతటి పనినైనా చేస్తారు. అవసరానికి వాడుకోవడంలో బాబుకు మించిన వారు లేరని గిట్టని వాళ్ళు, గిట్టే వాళ్ళు కూడా అనే మాట. మనుషుల్ని రాజకీయ ప్రయోజనాల కోసం కరివేపాకులా వాడుకోవడంలో చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలని వ్యంగ్యంగా అంటుంటారు. చంద్రబాబు వెన్నుపోటుకు బలైన వాళ్లలో మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : ఎన్టీఆర్ పై వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్న బాబు.. అధికారం కోసమేనా ..?

Chandrababu Naidu : చంద్రబాబు నాయుడుది వెన్నుపోటు రాజకీయం అని అందరూ అంటుంటారు. కానీ ఆయన దానిని ఏం మాత్రం పట్టించుకోరు. రాజకీయంగా ఎదిగేందుకు ఎంతటి పనినైనా చేస్తారు. అవసరానికి వాడుకోవడంలో బాబుకు మించిన వారు లేరని గిట్టని వాళ్ళు, గిట్టే వాళ్ళు కూడా అనే మాట. మనుషుల్ని రాజకీయ ప్రయోజనాల కోసం కరివేపాకులా వాడుకోవడంలో చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలని వ్యంగ్యంగా అంటుంటారు. చంద్రబాబు వెన్నుపోటుకు బలైన వాళ్లలో మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ తదితరుల గురించి ఉదాహరణకు చెబుతుంటారు. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు తనను మానవ సమాజం సిగ్గుపడేలా వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ స్వయంగా ఘాటు విమర్శలు చేశారు.

పదవి కోసం చంద్రబాబు చేసే క్రూరత్వం గురించి ఎన్టీఆర్ ఆవేశంగా చాలా విషయాలు చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన మచ్చ చంద్రబాబు నాయుడు పై ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పటికీ చెరిగిపోదు కూడా. చంద్రబాబుకు ఎంత చతురత ఉందంటే ఆఫ్ ది రికార్డ్ ఎన్టీఆర్ పై సరైన అభిప్రాయం లేదు. ఈ విషయాన్ని ఒక మీడియా అధిపతి తో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడిన వైనం అందరికీ తెలిసిందే. కానీ జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించే సమయంలో మాత్రం ఎన్టీఆర్ యుగ పురుషుడని కీర్తిస్తుంటారు. ఒక మనిషిని నీచుడనాలన్నా, గొప్పవాడని ప్రశంసించాలన్న కేవలం చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి.

మానసిక క్షోభకు గురిచేసి చివరికి ఎన్టీఆర్ ప్రాణాలు పోవడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు వల్ల మాలిన ప్రేమ వలక పోస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని గురువారం కృష్ణా జిల్లాలోని ఆయన స్వస్థలం నిమ్మకూరుకు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళనున్నారు. ఇదే రోజు రా కదలిరా కార్యక్రమాన్ని కూడా గుడివాడలో నిర్వహించనున్నారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎన్టీఆర్ ను పదేపదే స్మరించుకోవడం గమనించవచ్చు. అసలు ఎన్టీఆర్ ఉనికే లేకుండా చేయాలని చంద్రబాబు అనుకుంటున్నా, ఆయన పేరు చెప్పకపోతే జనాలు పట్టించుకోని పరిస్థితి. ఎన్టీఆర్ ను తలుచుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ ను అలా వాడేసుకుంటున్నారు

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది