CM Chandrababu : వారికి రూ.15 వేలు.. ఎప్పుడిస్తారో చెప్పిన చంద్రబాబు..!
CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలని ఉత్సాహపరిచే విషయాలు చెప్పుకొస్తుంది. తాజాగా కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పథకాన్ని పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా.. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
CM Chandrababu : క్లారిటీ ఇచ్చారుగా..
మే17న కర్నూలులో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు. జూన్ నెలలో పాఠశాలలు తెరిచేలోపు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించినట్లయింది. సీఎం చంద్రబాబే స్వయంగా జూన్ లో పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu : వారికి రూ.15 వేలు.. ఎప్పుడిస్తారో చెప్పిన చంద్రబాబు..!
కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీతో సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తల్లికి వందనం పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వం.. రూ. 9407 కోట్లు కేటాయింపులు చేసింది. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో సుమారు 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది.