Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు
ప్రధానాంశాలు:
మరోసారి బనకచర్ల ప్రాజెక్ట్‌పై చంద్రబాబు క్లారిటీ
తెలంగాణ ప్రాజెక్ట్‌లకు నేను ఎప్పుడు అడ్డు తగల్లేదు చంద్రబాబు
Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకూడదంటూ కేంద్రం వద్ద వాదిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతోంది.

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు
Chandrababu : తెలంగాణ ప్రాజెక్ట్‌లకు నేను ఎప్పుడు అడ్డు తగల్లేదు చంద్రబాబు
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, బనకచర్ల ప్రాజెక్ట్ సముద్రంలోకి పోతున్న నీటిని వినియోగించేందుకే రూపుదిద్దుకుందన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వ్యవస్థీకృతంగా ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాలేదని, నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు అంతా బాగుపడతారని పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతులను అన్నివిధాలా ఆదుకునే ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు.