Chandrababu Naidu : లోకేష్ కోసం ఇద్దరు PK లను నమ్ముకున్న చంద్రబాబు .. వాళ్లందరికీ షాక్ ఇచ్చిన జగన్ ..!!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : లోకేష్ కోసం ఇద్దరు PK లను నమ్ముకున్న చంద్రబాబు .. వాళ్లందరికీ షాక్ ఇచ్చిన జగన్ ..!!
ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పెను సంచలనంగా మారింది.ఆయన పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యర్థులు ఊహించని ప్లాన్స్ ను స్ట్రాటజీని అందిస్తూ ఉంటారు.
Chandrababu Naidu : ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పెను సంచలనంగా మారింది. ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యర్థులు ఊహించని ప్లాన్స్ ను స్ట్రాటజీని అందిస్తూ ఉంటారు. మొదట మోడీ వెనక ఉండి ప్రధానిని చేశారు. ఆయన వ్యూహాలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. వై.యస్.జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసింది కూడా ఆయనే. ఇప్పుడు ఏపీలో మరోసారి చంద్రబాబు నాయుడుని సీఎం గా చేసేందుకు చేతులు కలిపారు. ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరిపిన లోకేష్ ఆయనను విజయవాడకు తీసుకెళ్లారు. మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈయన సలహాల వలన వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటానికి ఉపయోగపడ్డాయి. కానీ కొన్నాళ్లకే జగన్ తో బంధాలు తెంపుకున్నారు.సీఎం అయిన తర్వాత జగన్ ప్రశాంత్ కిషోర్ మాటలను వినిపించుకోలేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ అతనితో బంధాన్ని తెంపుకొని టీడీపీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఎమ్మెల్యేలను పెడుతున్నారు. దీంతో టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇక నారా లోకేష్ ను సీఎంగా చేయాలని చంద్రబాబు ఆలోచన.
గెలిచేందుకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ని ఎంచుకున్నారు. గతంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను విమర్శించారు. కానీ ఇప్పుడు ఆయననే ఎన్నికల వ్యూహకర్తగా ఎంచుకున్నారు. గతంలో ఆయన ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేశారు. అందుకు తగ్గట్టుగా టికెట్లను కేటాయించనుంది. సీట్ల కేటాయింపు కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగానే జరుగుతుంది.గతంలో జనసేనకు 20 సీట్లు ఇచ్చేందుకు లోకేష్ పవన్ తో చర్చలు జరిపారట. కానీ తమకు 30 సీట్లు కావాలని పీకే కోరారని సమాచారం. అందుకే యువగళం పాదయాత్రకు వచ్చేందుకు సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న పవన్ రానన్నారట. చివరకు చంద్రబాబు 25 సీట్లు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. సీట్ల కంటే పదవులు ఇస్తామని చెప్పారంట. దీంతో టీడీపీ యువగళం సభకు పవన్ కళ్యాణ్ వచ్చారని టాక్. దీంతో ప్రశాంతే ఆ 25 సీట్లను కేటాయించనుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారు ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసి చెప్పనుందట. మొత్తానికి చంద్రబాబు ఇద్దరు పీకే లతో పని చేయాల్సి ఉంది.
ఇక ప్రశాంత్ కిషోర్ మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. మేధావులు కూడా ప్రశాంత్ కిషోర్ రాజకీయాలకు ముప్పు అని అంటుంటారు. ఆయన వ్యూహాలు భయంకరంగా ఉంటాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు ఎంతటి నీచమైన పని అయిన చేస్తారు. మరి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీం తో పని చేస్తారు. గెలిచిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే చేయాలి. లేదంటే వాళ్లతో విడిపోతారు. జగన్ విషయంలో కూడా అదే జరిగింది సోషల్ మీడియాలో వై.యస్.జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తి పోస్తారు. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ జగన్ కి షాకే. ఎటువంటి డ్రామా నైనా చేసే పార్టీని గెలిపిస్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిపిస్తారో చూడాలి.