Chandrababu : పార్టీ ఫ్యూచర్ కోసం చంద్రబాబు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారా.!
ప్రధానాంశాలు:
Chandrababu : పార్టీ ఫ్యూచర్ కోసం చంద్రబాబు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారా.!
Chandrababu : చంద్రబాబు 4.0 ఇప్పుడు ఏపీలో సరికొత్త చర్చకి దారి తీసింది. జూన్ 12న చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు. అందులో సీనియర్స్‌కి మొండి చేయి చూపించి కొత్తవాళ్లకి అవకాశం ఇచ్చారు. సీనియర్ల విషయంలో చంద్రబాబు అమలు చేసిన సింగిల్ పాయింట్ ఫార్ములాపై కూడా హాట్‌హాట్‌గా మాటలు నడుస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణ మూర్తి.. వీళ్లంతా టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్స్. వారు తెలుగుదేశం రంగు,రుచి, వాసన బాగా వంటబట్టించుకున్నవాళ్లు. అయితే ఈ సారి కేబినేట్‌లో వారి అడ్రెస్ గల్లంతైంది.
Chandrababu చంద్రబాబు సరికొత్త స్కెచ్..
కొత్తగా కొలువుదీరిన 24 మంది మంత్రుల్లో 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు. వీళ్లలో 17 మంది కొత్తవాళ్లు.. 8 మందయితే పూర్తిగా ఫ్రెష్షర్స్. గతంలో అసెంబ్లీ మొహమే చూడని ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు. అధినేత నిర్ణయమే శిరోధార్యం అనుకుని సీనియర్స్ అంతా గప్‌చుప్‌గా ఉండిపోయారు సీనియర్లు. క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం.. సాహసోపేతమైనదన్న మాటైతే వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప.. ఈ నాలుగు జిల్లాల్లో జూనియర్లకే మంత్రి పదవులివ్వడాన్ని పార్టీ అధిష్టానం గట్టిగా సమర్థించుకుంటోంది. ఇక్కడ సీనియర్-జూనియర్ ఇష్యూను టాకిల్ చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించింది తెలుగుదేశం అధిష్టానం. ఆయా జిల్లాల్లో సీనియర్ ఫ్యామిలీల మధ్య ఉండే విభేదాల్ని సర్దుబాటు చెయ్యాలంటే.. అందరినీ క్యాబినెట్‌కి దూరంగా పెట్టడమొక్కటే మార్గం.
ఒకరికిస్తే మరొకరు నొచ్చుకుంటారు కనుక… కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా పాతవాళ్లందరి నోళ్లూ మూయించవచ్చని హైకమాండ్ భావించిందా? జిల్లాల్లో గంటా-అయ్యన్న మధ్య నడిచే ఆధిపత్యపోరు లోకల్‌గా అందరికీ తెలుసు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా విశాఖ టీడీపీలో మరో సీనియర్ నేత. ఆయన అల్లుడు రామ్మోహన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం రావడంతో.. రాష్ట్ర క్యాబినెట్‌లో తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం లేదు. ఇలా సీనియర్లందరికీ తలోరకంగా చెక్ పెడుతూ.. చివరాఖరికి.. పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అవకాశమిచ్చారు. ఎస్సీగా, మహిళగా అనితకు ఛాన్స్ ఇచ్చి.. విశాఖ జిల్లా రాజకీయాల్ని కీలక మలుపు తిప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలో సైతం దాదాపుగా ఇదే ఫార్ములానా వర్కవుట్ చేసింది టీడీపీ హైకమాండ్. సీనియర్-జూనియర్ ఇష్యూను చంద్రబాబు ట్యాకిల్ చేసిన తీరు.. 4 జిల్లాల్లో ఆయన పాటించిన సింగిల్ పాయింట్ ఫార్ములా హాట్ టాపిక్ అయింది. పెద్దోళ్ల సేవల్ని విస్మరించకుండా పార్టీలో ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో చంద్రబాబుకు క్లారిటీ ఉందట.