Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో ముఖ్యంగా మహిళలు నేతృత్వం వహించి, చంద్రబాబుపై తమకు ఉన్న అభిమానాన్ని వేలిముద్రల రూపంలో తెలియజేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పూరి ఆర్ట్స్‌కు చెందిన కళాకారుడు పురుషోత్తం ఆధ్వర్యంలో మహిళలు కలిసి వేలిముద్రలతో చంద్రబాబు చిత్రాన్ని రూపొందించారు. ఇది కేవలం కళాకృతి మాత్రమే కాకుండా, వారి అభిమానానికి ప్రతిరూపంగా నిలిచింది.

Chandrababu చంద్రబాబు జన్మదిన వేడుకలు వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం కుప్పం మహిళల మజాకా

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu చంద్రబాబు జన్మదిన వేడుకలు.. వినూత్నంగా తమ అభిమానం చాటుకున్న కుప్పం మహిళలు

ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు కుప్పం ప్రజలకు విలువైన ఆస్తి అని, ఆయన పుట్టినరోజు వారికి పండుగలా అనిపిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, కుప్పం ప్రజలు ఆయన్ను దేవుడిగా భావిస్తున్నారన్నమాటకు ఇది నిదర్శనమని వివరించారు. ఈ అరుదైన చిత్రాన్ని గ్రామాల్లో ఊరేగించి ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు తమ చేతి వేలిముద్రలతో రూపొందించిన ఈ కళా చిత్రానికి గ్రామస్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పండుగ సందర్భంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు ప్రార్థనలు చేయాలని కోరారు. చంద్రబాబు సేవలు, ఆయన సాధించిన విజయాలను పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది