Chandrababu : ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో గుడ్‌న్యూస్..!
ప్రధానాంశాలు:
Chandrababu : ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో గుడ్‌న్యూస్..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో ముఖ్యమంత్రి CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భాద్యతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై భారీగా రాయితీ ప్రకటించడం ప్రజలకు ఊరటనిస్తుంది. ఇదివరకు ప్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడింది. ఇది మధ్యతరగతికి భారంగా మారిన నేపథ్యంతో ఇప్పుడు ప్రభుత్వం రెండు విడతల మోడల్‌ను ప్రవేశపెట్టింది.

Chandrababu : ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో గుడ్‌న్యూస్..!
Chandrababu రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ప్రకటించిన చంద్రబాబు..ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు
ఈ కొత్త విధాన ప్రకారం.. ఒకే ప్లాట్‌ను రెండు విడతలుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్ విలువలో 60% బేస్ ప్రైస్‌గా పరిగణించి దానిపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయనున్నారు. మిగిలిన 40% అభివృద్ధి ఛార్జీలపై మాత్రం కేవలం 0.5% మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు విధించనున్నారు. ఈ విధానం వల్ల మొత్తం రిజిస్ట్రేషన్ ఖర్చు గణనీయంగా తగ్గనుంది. ప్రజలపై పడే భారం తగ్గేలా ఈ మార్పులు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రయోజనం ఇప్పటికే లాటరీ ద్వారా ప్లాట్ కేటాయించుకున్న వారికీ వర్తించనుంది.
ఈ విధానం CRDA, విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అమలులోకి రానుంది. దీనికి అనుగుణంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు త్వరలో తమ ప్లాట్లను రెండు విడతల రిజిస్ట్రేషన్ విధానంలో నమోదు చేసుకునే అవకాశాన్ని పొందనున్నారని ప్రకటించారు. మధ్యతరగతి వర్గానికి ఇంటి కలను నిజం చేయడంలో ఈ నిర్ణయం ప్రధానంగా సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.