chandrababu to be arrested again
Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబుకు నిన్ననే రెగ్యులర్ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మధ్యంతర బెయిల్ మీద ఉన్న చంద్రబాబుకు మళ్లీ రెగ్యులర్ బెయిల్ రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ అభిమానులు పండుగ చేసుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా చాలా సంతోషించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు నుంచి ఇక చంద్రబాబు బయటపడ్డట్టే అని అందరూ అనుకున్నారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే.. చంద్రబాబుకు బెయిల్ వచ్చినంత మాత్రాన ఇక కేసుల నుంచి బయటపడినట్టే అని అనుకోవడం తప్పే అవుతుంది. నిజానికి.. ఈ చర్చ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. ఏపీ హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసినా కూడా ఆయన్ను ఇతర కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి చంద్రబాబుపై ఒక్క స్కిల్ స్కామ్ కేసు మాత్రమే కాదు.. చాలా కేసులను నమోదు చేశారు. కొన్ని ఇప్పటికే కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆయన్ను ముందు స్కిల్ స్కామ్ కేసులోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కామ్.. ఇలా చాలా కేసుల్లో ఆయన పేరును యాడ్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత అవినీతి చేశారు.. ఎన్ని కోట్లు దారి మళ్లించారు అనే దానిపై సీఐడీ అధికారులు సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అక్కడ చంద్రబాబును విచారించినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. చంద్రబాబు నుంచి వాళ్లు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబును త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై, ఆయన చేసిన అవినీతిపై పక్కా ఆధారాలను సీఐడీ సేకరించినట్టు తెలుస్తోంది. కావాలని రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చారని.. దాని వల్ల తన సన్నిహితులకు భారీగా లబ్ధి చేకూరిందని సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో హెరిటేజ్ సంస్థ గురించి కూడా సీఐడీ అధికారులు ప్రస్తావించడంతో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పేర్లను కూడా చేర్చే అవకాశం ఉంది.
ఈ కేసులో హెరిటేజ్ సంస్థ వేల కోట్ల లాభాలు పొందినట్టు తెలుస్తోంది. అయితే.. రింగ్ రోడ్డే వేయలేదు.. అసలు అవినీతి ఎలా జరుగుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నా.. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి చంద్రబాబును అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే.. ఫైబర్ నెట్ కేసు కూడా అంతే. ఇసుక, మద్యం కుంభకోణం, అంగళ్లు అల్లర్లు.. ఇలా చాలా కేసులు చంద్రబాబుపై నమోదు చేయడంతో అసలు ఏ కేసులో ఎప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తారో తెలియడం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కాకపోతే మరో స్కామ్.. ఏ స్కామ్ లో ఎలాంటి చిన్న ఆధారం దొరికినా వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఐడీ అధికారులు చూస్తున్నట్టు తెలుస్తోంది.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.