YS Jagan – Chandrababu : ఏపీలో మరో 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి.ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక అధికార పార్టీ అధినేత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ వదలకుండా జగన్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. తన అన్నకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వై.యస్.షర్మిల ఏపీ రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు జగన్ పై తన చెల్లి షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక చిన్న కుటుంబం ఉంటుంది. అందులో అన్న చెల్లి ఉంటారు. వాళ్లకు రెండు ఎకరాలు ఉంటుంది. ఆ రెండు ఎకరాలను అతడే ఉంచుకుంటాడా చెల్లికి ఇస్తాడా.. అవసరమైతే ఆ రెండు ఎకరాలు అమ్మి చెల్లికి పెళ్ళి అయిన చేస్తారు కానీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆస్తి లో సగం తన చెల్లికి ఇవ్వకుండా అన్యాయం చేశాడు. తన చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. జగనన్న వదిలిన బాణం రివర్స్ లో వస్తుంది అని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కి రీ కౌంటర్ గా వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు కి తోడుగా ఉన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానల్స్ లేవని, దత్తపుత్రుడిలాగా అండదండలు లేవని,
నీ బిడ్డ నమ్మకుంది పైన దేవుడిని కింద మిమ్మల్ని అని ప్రజలను సూచించారు. రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువగా చెబుతారని, మోసాలు ఎక్కువ అవుతాయని అన్నారు. ప్రజలకు ఏ మంచి చేయని వారికి ప్రజలను మోసం చేసే చంద్రబాబు నాయుడుకి ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని మీ బిడ్డ వాళ్ళు ఎవరిని నమ్మకోలేదని, వీళ్ళందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగినా ఇళ్లలోని అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెనర్లు అని వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ వై.ఎస్.షర్మిల పై జగన్ వ్యాఖ్యలు చేశారు.
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
This website uses cookies.