YS Jagan – Chandrababu : కౌంటర్ – రీ కౌంటర్ … చంద్రబాబు నాయుడు VS సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan – Chandrababu : కౌంటర్ – రీ కౌంటర్ … చంద్రబాబు నాయుడు VS సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

YS Jagan – Chandrababu : ఏపీలో మరో 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి.ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక అధికార పార్టీ అధినేత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ వదలకుండా జగన్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,8:00 pm

YS Jagan – Chandrababu : ఏపీలో మరో 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి.ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక అధికార పార్టీ అధినేత సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ వదలకుండా జగన్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. తన అన్నకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వై.యస్.షర్మిల ఏపీ రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు జగన్ పై తన చెల్లి షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక చిన్న కుటుంబం ఉంటుంది. అందులో అన్న చెల్లి ఉంటారు. వాళ్లకు రెండు ఎకరాలు ఉంటుంది. ఆ రెండు ఎకరాలను అతడే ఉంచుకుంటాడా చెల్లికి ఇస్తాడా.. అవసరమైతే ఆ రెండు ఎకరాలు అమ్మి చెల్లికి పెళ్ళి అయిన చేస్తారు కానీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆస్తి లో సగం తన చెల్లికి ఇవ్వకుండా అన్యాయం చేశాడు. తన చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. జగనన్న వదిలిన బాణం రివర్స్ లో వస్తుంది అని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కి రీ కౌంటర్ గా వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు కి తోడుగా ఉన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానల్స్ లేవని, దత్తపుత్రుడిలాగా అండదండలు లేవని,

నీ బిడ్డ నమ్మకుంది పైన దేవుడిని కింద మిమ్మల్ని అని ప్రజలను సూచించారు. రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువగా చెబుతారని, మోసాలు ఎక్కువ అవుతాయని అన్నారు. ప్రజలకు ఏ మంచి చేయని వారికి ప్రజలను మోసం చేసే చంద్రబాబు నాయుడుకి ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని మీ బిడ్డ వాళ్ళు ఎవరిని నమ్మకోలేదని, వీళ్ళందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగినా ఇళ్లలోని అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెనర్లు అని వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ వై.ఎస్.షర్మిల పై జగన్ వ్యాఖ్యలు చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది