Chandrababu : మీడియా మీద పడి ఏడవడం కరక్ట్ కాదు కాదు చంద్రబాబు గారూ !
Chandrababu : మీడియా అంటేనే ఎవరికీ లొంగకుండా పనిచేసేది. రాజకీయ నాయకులు, ప్రభుత్వం, అధికారులు ఎవరికీ ఇన్‌ఫ్ల్యూయెన్స్ కాకుండా పని చేస్తుంది. అందుకే మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేది మీడియానే. కానీ.. ఆ మీడియాను ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు ఫోర్స్ చేస్తున్నారు. తమకు మద్దతుగా ఉండాలంటూ, తమకు అనుకూలంగా కథనాలు రాయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి.. ఏపీ కానీ.. తెలంగాణ కానీ.. మరే రాష్ట్రం కానీ.. ఎక్కడైనా మీడియా అంటేనే ఒక పార్టీకి ఒత్తాసు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో అయితే ఎల్లో మీడియా పేరుతో కొన్ని పత్రికలు చేసే రచ్చ అందరికీ తెలుసు. అయితే.. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాపై సుర్రుమన్నారు. అసలు మేము అధికారంలోకి వస్తే.. మీడియా సంగతి తేల్చుతాం అన్న రేంజ్ లో ఫైర్ అయ్యారు. నిజానికి చంద్రబాబు ఇంతలా మీడియాపై ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ.. ఈ మధ్య మీడియా అంటేనే ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రెండు వర్గాల మీడియా ఉన్నట్టుగా తెలుస్తోంది. పచ్చ మీడియా అంటే తెలుసు కదా.
Chandrababu : బ్లూ మీడియాపై విరుచుకుపడుతున్న చంద్రబాబు
తాజాగా బ్లూ మీడియా అంటూ ఓ సెక్షన్ మీడియాకు నామకరణం చేశారు. అది ఏ మీడియానో.. ఎవరి మీడియానో అందరికీ తెలుసు. ఆ మీడియా ఒకే వర్గం వార్తలు రాస్తోందని, ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలపై ఫోకస్ చేయడం లేదని, అసలు అధికార ప్రభుత్వం ఏం చేస్తుంది.. అధికార ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా వాళ్లపై ఒక నెగెటివ్ వార్త కూడా రావడం లేదు. అందుకే.. చంద్రబాబు ఆ వర్గం మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. చంద్రబాబుకు ఒక వర్గం మీడియా మద్దతు ఇస్తే తప్పు లేదు కానీ.. ఆయనపై వ్యతిరేకంగా వేరే మీడియా వార్తలు రాయగానే కోపం వచ్చిందా అంటూ చంద్రబాబుపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు విరుచుకుపడుతున్నారు.