chandrababu naidu ఇంకా మూడు విడతల పంచాయతీ పోరు లో టీడీపీ దే పై చేయి ?
chandrababu naidu : ఏపీ పంచాయితీ ఎన్నికల్లో వైకాపాది స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది. చాలా చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా సర్పంచ్ లు అవుతుండగా చాలా చోట్ల తెలుగు దేశం పార్టీ కి కనీసం అభ్యర్థులు కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో దాదాపుగా 50 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కనీసం బాధ్యతలు నిర్వహించేందుకు ఇంచార్జ్ లు కరువయ్యారు. అక్కడ పార్టీ కోసం అభ్యర్థులను ఎంపిక చేయడం గందరగోళం గా మారింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పోటీకి దిగుతున్నారు. ఇది పార్టీకి మరింతగా నష్టం చేకూర్చే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల వారు చెబుతున్నారు. ఇక రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్. కాని వరుసగా ఓటమలు వస్తే పార్టీ మనుగడ కష్టం. అందుకే టీడీపీని బతికించుకునేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
వైకాపాపై బాబు ఎదురు దాడి…
తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నిరాశ పడేలా ఫలితాలను చవి చూడటం ఖాయం అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పంచాయితీ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని బయటకు తీసి ఏకగ్రీవాల గుట్టు విప్పడం ద్వారా వైకాపా పై బాబు ఎదురు దాడి చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల హడావుడి అయిపోయింది. ఆ దశలో తెలుగు దేశం పార్టీ నాయకులు నిరాశ పర్చారు. వైకాపా కు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేయడంలో విఫలం అయ్యారు. ఇకపై ప్రభుత్వం పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ప్రజల్లో వారికి సంబంధించిన మంచి పేరును దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
chandrababu naidu : మిగిలిన మూడు విడతలపై దృష్టి…
పంచాయితీ ఎన్నికలను వైకాపా లైట్ తీసుకున్నట్లుగా మొదట కనిపించినా కూడా ఆ పార్టీ నాయకులు ఎంత సీరియస్ గా ఉన్నారో మొదటి దశను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక రెండవ దశ నుండి అయినా తెలుగు దేశం పార్టీ కాస్త సీరియస్ గా ఉండాలని, అధికార వైకాపా ను సీరియస్ గా ఎదుర్కోవాలని భావిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ముందే చేతులు ఎత్తేసినట్లుగా మాట్లాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వారికి క్లాస్ పీకాడట. ప్రయత్నించకుండానే ఓడిపోతే అంతకు మించిన దౌర్బాగ్యం ఉండదు. ఈ ఎన్నికల్లో సత్తా చాటితేనే ముందు ముందు పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు నాయకుల్లో ఉత్సాహం నింపాడు. వారి ఉత్సాహం చూస్తుంటే మిగిలిన మూడు విడతల ఎన్నికల్లో టీడీపీ దుమ్ము రేపనుందా అనే అనుమానం కలుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.