Categories: EntertainmentNews

Ibomma : టాలీవుడ్ నిర్మాతలకు “ఐ బొమ్మ” వెబ్ సైట్ మాస్ వార్నింగ్..!!

Ibomma : తెలుగు సినీ ప్రేక్షకులకు “ఐ బొమ్మ” అనే వెబ్ సైట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటిటి లలో విడుదలయ్యే సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా అభిమానులకు అందుబాటులోకి తీసుకువచ్చే వెబ్ సైట్. ఈ సైట్ ద్వారా సినీ ప్రీయులు.. కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను ఫ్రీగా చూస్తూ ఆనందం పొందుతారు. అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ “ఐ బొమ్మ” పై ఇప్పటివరకు చాలా సార్లు రూమర్లు రావడం జరిగాయి. గతంలో ఈ వెబ్ సైట్ మూసి వేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో ఐ బొమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మతి పోగట్టేలా మాస్ వార్నింగ్ ఇచ్చింది. “ఐ బొమ్మ” పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినీ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ నోట్ విడుదల చేసింది. “ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం
పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.

1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా…..
2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు, వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి… వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.
3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.
4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.

టాలీవుడ్ నిర్మాతలకు “ఐ బొమ్మ” వెబ్ సైట్ మాస్ వార్నింగ్..!!

మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e – సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.
ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..

ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు, బురదలో రాయి వేయకండి… అది కూడా పెంట మీద అసలు వేయకండి.
మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము. (చావుకు భయపడని వాడు దేనికి భయపడడు) అంటూ రాసుకునీ రావడం జరిగింది.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

2 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

14 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

16 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

20 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

23 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago