Chevireddy Bhaskar Reddy : వైరల్ గా మారిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆడియో..!
ప్రధానాంశాలు:
Chevireddy Bhaskar Reddy : వైరల్ గా మారిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆడియో లీక్..!
మద్యం కుంభకోణం లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాయిస్ కాల్ లీక్
Chevireddy Bhaskar Reddy : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కి చెందిన నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని S.I.T అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని విమానాశ్రయం నుంచి శ్రీలంకకు బయలుదేరే ప్రయత్నంలో ఉన్న చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని, నిన్న రాత్రి విజయవాడకు తరలించి విచారణ చేపట్టారు. ఈ అరెస్టు రాజకీయం పునాది మీద జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Chevireddy Bhaskar Reddy : వైరల్ గా మారిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆడియో..!
Chevireddy Bhaskar Reddy : సంబంధం లేని కేసులో తనను ఇరికించారని చెవిరెడ్డి ఆవేదన
ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు ఓ వాయిస్ మెసేజ్ ద్వారా సంకేతం పంపారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచినందుకు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు. “ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుని నిలబడతాను. మీ ఆశీస్సులు, జగన్ అన్న ఆశీర్వాదం నాతో ఉంది” అంటూ కార్యకర్తలను ధైర్యం చెప్పారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయని, వాటిని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిదీ అని గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడు తనను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. తాను ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేకపోయినా కావాలనే ఇరికించారని విమర్శించారు. “జగన్ అన్న అడుగుజాడలో నడవాలి, పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా నిలవాలి” అంటూ ఉత్సాహపూరితంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత మరింత బలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇది రాజకీయ వేధింపులకు సంబంధించినదిగా వైసీపీ వర్గాలు వ్యూహాత్మకంగా అర్ధం చేసుకుంటున్నాయి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాయిస్ మెసేజ్..
జగనన్న వెనుక ఎవరైతే గట్టిగా ఉంటారో వారిని జైలుకు పంపే కుట్ర
జగనన్న పోరాట స్ఫూర్తితో అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధం pic.twitter.com/8aXGpm3FT6
— BIG TV Breaking News (@bigtvtelugu) June 18, 2025