Chiranjeevi : తమ్ముడు ని తిడుతుంటే బాధగా లేదా... కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన...!
Chiranjeevi : సినీ నటుడు చిరంజీవి ఇటీవల పద్మభూషణ్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి చిరంజీవి ముచ్చటించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా అభిమానుల హృదయాలను గెలుచుకున్న చిరంజీవి , మరోవైపు ప్రజాసేవ చేస్తూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధంగా ఉన్న కిషన్ రెడ్డి ఇటీవల ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారిద్దరు పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఒకరి అనుభవాలను ఒకరితో పంచుకుంటూ వారి యొక్క వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు.
ఈ నేపథ్యంలోని చిరంజీవి తన సినీ జీవితంతో పాటు రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మంత్రి కిషన్ రెడ్డితో పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి తొలిసారి వచ్చినప్పుడు అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారని ,కానీ చర్చలు ముగిసిన తర్వాత తిరిగి వాళ్లంతా కలుసుకుని భుజాలపై చేతులు వేసుకొని మాట్లాడుకోవడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లుగా చిరంజీవి తెలియజేశారు. ఇక ఇప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారని ఆ నియోజకవర్గ నుండి తన తమ్ముడు గెలుపొందాల్సిందిగా చిరంజీవి కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలను తాను పట్టించుకోబోనని చిరంజీవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ అనుభవాల గురించి తాను చేసిన సేవలు గురించి చిరంజీవితో పంచుకున్నారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు వచ్చారని వారిలో ప్రముఖంగా మీ కుమారుడు రామ్ చరణ్ మరియు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉంటారని తెలిపారు.
Chiranjeevi : తమ్ముడు ని తిడుతుంటే బాధగా లేదా… కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన…!
ఇక వీరిద్దరిలో మీకు ఎవరు సినిమాలంటే బాగా నచ్చుతాయి అని కిషన్ రెడ్డి చిరంజీవిని ప్రశ్నించగా దానికి సమాధానం ఇస్తూ..పవన్ కళ్యాణ్ సినిమాలలో నాకు తొలిప్రేమ సినిమా అంటే చాలా ఇష్టం అని తెలిపారు. దానితో పాటు బద్రి ,జల్సా ,అత్తారింటికి దారేది వంటి సినిమాలు చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే తను నటించిన రెండో సినిమా మగధీర నాభుతో నా భవిష్యత్తు. ఆ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని , ఇప్పటికీ ఆ సినిమా చూస్తూ ఉంటానని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంలోనే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మీరు అసెంబ్లీలో ఉన్న సమయంలోనే మీ అబ్బాయి సినిమా మగధీర బాగా నడుస్తుందని నాతో చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా వీరి యొక్క చర్చలు ముగిసాయి.
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
This website uses cookies.