TDP Alliance : కూటమి నేతల్లో కుమ్ములాటలు.. పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు..!
TDP Alliance : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా అంతర్గత విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి వారు ఒకేస్టేజిపై నవ్వుతూ కనిపిస్తున్నా.. కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య మాత్రం విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరట్లేదు. దాంతో ఒక పార్టీపై ఇంకో పార్టీ వారు నిత్యం ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు. ఓ వైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతున్నా సరే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు మాత్రం ఇంకా కుమ్ములాటలు సాగిస్తూనే ఉన్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి టీడీపీ నేతలకు, జనసైనికులకు ఇక్కడ అస్సలు పడట్లేదు. ఇక తాజాగా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి లంకలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ అధ్యక్షతన కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే జనసేన నేతలను స్టేజిపైకి పిలవలేదు. దాంతో స్టేజిపైనే తమకు స్థానం లేనప్పుడు ఇక్కడకు ఎందుకు పిలిచారంటూ జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Alliance : కూటమి నేతల్లో కుమ్ములాటలు.. పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు..!
హరీష్ మాధుర్ ముందే గొడవకు దిగారు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచిబయటకు వెళ్లిపోయారు. దాంతో ఎంపీ అభ్యర్థి హరీష్‌మాధుర్ కలుగజేసుకొని జనసేన నేతలకు నచ్చచెప్పారు. వారిని మతిమాలి మరీ స్టేజిపైకి తీసుకొచ్చారు. ఇంకోసారి పొరపాటు జరగకుండా కమిటీలు వేస్తానంటూ ఆయన తెలిపారు. దాంతో జనసైనికులు శాంతించారు. అయితే ఇదే నియోజకవర్గంలోని చాకలిపాలెంలోను సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా జనసైనికులు, టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది.
అక్కడ కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో సమావేశం కాస్తా రసాభాసాగా మారిపోయింది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా వీరి మధ్య ఇంకా సఖ్యత రాలేదంటే రేపు ఫలితాలు ఎలా ఉంటాయో అని అంటున్నారు రాజకీయ నిపుణులు.
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
This website uses cookies.