Choreographer Jani master : ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో.. నాకు జగన్ అంటే అంత ఇష్టం.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Choreographer Jani master : ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో.. నాకు జగన్ అంటే అంత ఇష్టం.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ..!!

 Authored By anusha | The Telugu News | Updated on :29 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Choreographer Jani master : ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో.. నాకు జగన్ అంటే అంత ఇష్టం.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ..!!

  •  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు జానీ మాస్టర్ మద్దతు తెలిపారు.

Choreographer Jani master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు జానీ మాస్టర్ మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ లో న్యాయం ఉందని, వారి డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జానీ మాస్టర్ అన్నారు. తాను కూడా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన వాడినేనని, వారి కష్టం తనకు తెలుసు అని చెప్పారు. నేను నెల్లూరు నుంచి వచ్చిన వాడిని. అంగన్వాడీ కేంద్రంలో కూడా నేను తిన్న వాడిని, చదివిన వాడిని. బిషప్ శౌరి హై స్కూల్లో చదివాను. నేను పుట్టింది పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ రకరకాల వృత్తుల వారు ఉన్నారు. వాళ్ళందరి గురించి నాకు తెలుసు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు, వాళ్లను అంగన్వాడి కార్యకర్తలు ఎంత బాగా చూసుకుంటారు అనే విషయాలు నాకు తెలుసు. ఇంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి ఇన్నాళ్లుగా సమ్మె చేస్తున్న అది ముందుకు వెళ్లకపోవడం చూసి చాలా బాధపడ్డాను.

నా వల్ల ఏమైనా అవుతుందేమో అని నా మాట సాయం వాళ్లకు పనికొస్తుందేమో అని వచ్చాను, నా మద్దతు తెలియజేశాను అని జానీ మాస్టర్ వెల్లడించారు. ఆ తర్వాత రిపోర్టర్స్ అడిగిన పలు ప్రశ్నలకు జానీ మాస్టర్ సమాధానం చెప్పారు. 2024 ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా అని అడగగా.. తెలియదు సార్ నుదిటి మీద ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మద్దతు ఏ పార్టీకి ఇస్తున్నారు అని మరో రిపోర్టర్ అడగగా.. మద్దతు గురించి నేను ఇంకా ఏమీ అనుకోలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు. మీరు జనసేన తరపున వచ్చారని అందరూ అంటున్నారు..మీరేమంటారు అని ప్రశ్నించగా… నేను మళ్ళీ చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి. రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంత ఇష్టం.

ముందు ముందు ఏం జరుగుతుందో నేను తర్వాత చెప్తాను అని వెల్లడించారు. అంగన్వాడి కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారా అని అడగగా..వాళ్ళు డిమాండ్ చేసేది వాళ్ళ హక్కు. అంత పెద్ద బాధ్యత నెత్తిన వేసుకొని ఇంటింటికి వెళ్లి పిల్లలని చూసుకోవడం అనేది పెద్ద బాధ్యత. ఒక పిల్లాడిని చూసుకోవాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. వాళ్ళు అంత కష్టపడి పని చేస్తున్నప్పుడు గుర్తించాలి. వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నారు. వాటికి సిగ్నల్ ఉండదు. అప్పటికప్పుడు ఫోటోలు పెట్టమంటారు. వీళ్ళు ట్రై చేస్తారు కానీ సిగ్నల్ దొరకదు. దానికి మీరు పని చేయట్లేదు అని ఉన్నతాధికారులు అంటారు అని జానీ మాస్టర్ వివరించారు. అయితే అంగన్వాడి కార్యకర్తల సమ్మెకు మద్దతు ఇవ్వడానికి జానీ మాస్టర్ జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లడం గమనార్హం.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది