TDP Alliance : కూటమి నేతల్లో కుమ్ములాటలు.. పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP Alliance : కూటమి నేతల్లో కుమ్ములాటలు.. పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు..!

TDP Alliance : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా అంతర్గత విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లాంటి వారు ఒకేస్టేజిపై నవ్వుతూ కనిపిస్తున్నా.. కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య మాత్రం విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరట్లేదు. దాంతో ఒక పార్టీపై ఇంకో పార్టీ వారు నిత్యం ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు. ఓ వైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతున్నా సరే.. ఇటు టీడీపీ, […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP Alliance : కూటమి నేతల్లో కుమ్ములాటలు.. పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు..!

TDP Alliance : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా అంతర్గత విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లాంటి వారు ఒకేస్టేజిపై నవ్వుతూ కనిపిస్తున్నా.. కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య మాత్రం విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరట్లేదు. దాంతో ఒక పార్టీపై ఇంకో పార్టీ వారు నిత్యం ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు. ఓ వైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతున్నా సరే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు మాత్రం ఇంకా కుమ్ములాటలు సాగిస్తూనే ఉన్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

TDP Alliance : అభ్యర్థి ముందే గొడవ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి టీడీపీ నేతలకు, జనసైనికులకు ఇక్కడ అస్సలు పడట్లేదు. ఇక తాజాగా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి లంకలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ అధ్యక్షతన కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే జనసేన నేతలను స్టేజిపైకి పిలవలేదు. దాంతో స్టేజిపైనే తమకు స్థానం లేనప్పుడు ఇక్కడకు ఎందుకు పిలిచారంటూ జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Alliance కూటమి నేతల్లో కుమ్ములాటలు పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు

TDP Alliance : కూటమి నేతల్లో కుమ్ములాటలు.. పోలింగ్ దగ్గరపడుతున్నా ఆగని గొడవలు..!

హరీష్ మాధుర్ ముందే గొడవకు దిగారు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచిబయటకు వెళ్లిపోయారు. దాంతో ఎంపీ అభ్యర్థి హరీష్‌మాధుర్‌ కలుగజేసుకొని జనసేన నేతలకు నచ్చచెప్పారు. వారిని మతిమాలి మరీ స్టేజిపైకి తీసుకొచ్చారు. ఇంకోసారి పొరపాటు జరగకుండా కమిటీలు వేస్తానంటూ ఆయన తెలిపారు. దాంతో జనసైనికులు శాంతించారు. అయితే ఇదే నియోజకవర్గంలోని చాకలిపాలెంలోను సేమ్‌ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా జనసైనికులు, టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది.

అక్కడ కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో సమావేశం కాస్తా రసాభాసాగా మారిపోయింది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా వీరి మధ్య ఇంకా సఖ్యత రాలేదంటే రేపు ఫలితాలు ఎలా ఉంటాయో అని అంటున్నారు రాజకీయ నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది