Chandrababu : మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త.. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా, రుణంలో 35 శాతం రాయితీ !
ప్రధానాంశాలు:
Chandrababu : మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త.. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా, రుణంలో 35 శాతం రాయితీ !
Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మరో కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు.రాబోయే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P-4 కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తామని చెప్పారు. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా డ్వాక్రా మహిళలకు మరింత మేలు కలిగేలా కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ), ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని (పీఎంఈజీపీ) దీనికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ పథకాల కింద వ్యాపారం చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి, ఆ రుణంలో 35 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారికి రూ.35 వేలు రాయితీ లభించనుంది. అయితే ఎంపిక చేసిన వ్యాపారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.