Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల..!
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు ఖాతాకు 5,000 చొప్పున జమ చేసింది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా 2,000 చొప్పున రైతులకు సాయం అందించింది.
Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు ఖాతాకు మొత్తం 7,000 జమ అయ్యాయి. ఈ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి మొత్తం 20,000 అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలావుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కీలక ప్రకటన చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం కింద 20వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. ఈ విడుదలతో దేశవ్యాప్తంగా 9.70 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు 20,500 కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. ఈ పథకం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో 2019 ఫిబ్రవరి 24న కేంద్రం ప్రారంభించింది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.