Ruia Incident : రుయా ఘటనపై సీఎం జగన్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Ruia Incident : ఇటీవల రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకూడదంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ సర్వీసులను ఉంచాలని అదీ ఉచితంగా పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఆ అంబులెన్స్ సర్వీస్ నడిపించాలి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడ కూడా అలాంటి దారుణాలు వెలుగు చూడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు అప్పగిస్తున్నట్లు గా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్యుల ఆస్పత్రి వద్ద ఆంబులెన్స్ సర్వీసులకు సంబంధించిన వివరాలను వెంటనే తెలియజేయాలని కూడా సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఫిర్యాదు నెంబర్లకు మంచి రెస్పాన్స్ వచ్చేలా ఆ నెంబర్లను అందరికీ కనిపించే విధంగా డిస్ప్లే చేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ సర్వీసులు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుందని ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తెలిసే విధంగా ప్రచారం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రుయా ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు ఆసుపత్రి వర్గాల వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. గత కొంత కాలంగా ఆస్పత్రి వద్ద జరుగుతున్న అంబులెన్స్ కు సంబంధించిన వివరాలను కూడా పార్టీ నాయకులు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాంటి వ్యవహారాలు ఇకపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సీఎం ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లు సమాచారం అందుతోంది.