YS Jagan Mohan Reddy : నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు ‘.. సిద్ధం సభలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు..!

YS Jagan Mohan Reddy  : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు 55 రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ సిద్ధం ‘ సభలను నిర్వహిస్తూ సంక్షేమ పథకాలతో ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా అనంతపురం రాప్తాడు లో జరిగిన సిద్ధం సభకు జన సముద్రం తరలివచ్చింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెలనిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు అని అన్నారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్తు కోసం వారి తరపున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు మన రాష్ట్రానికి మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకొని ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతున్న యుద్ధం ఇది అన్నారు. మన ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమ అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. కానీ ఆయన పేరు చెప్తే రైతులకు గుర్తొచ్చే ఒక పక్క పథకమైన ఉందా అని, ఆయన పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని, ఆయన పేరు చెప్తే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా అని, కనీసం అవ్వ తాతల కైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికి పంపాడు అన్న పరిస్థితి ఉందా అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటుచేసిన పరిపాలన వ్యవస్థ కనిపిస్తుందా.. బాగుపడిన స్కూల్స్, ఆసుపత్రిలు ఉన్నాయా..కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా ఆయన మార్క్ ఉందా అని అన్నారుష చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి చెప్పాలని , మోసాన్ని భరించలేకే ఐదేళ్ల క్రితం అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి, కూర్చుని లాగేసిమ చూపులతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23 కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని వైయస్ జగన్ అన్నారు.

మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్ గా బయటకు రావాలి. వైఎస్సార్సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వివరించాలి. ఒకసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందున్నడు చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బికే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలాగా రైతన్నకు సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది ఈ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదు. ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్ నేరుగా ముందుకు వచ్చి ఇంకో 100 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యాని పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబునాయుడు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని గిన్నెని లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని మోసం చేశాడు. అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ , చేయూత , కాపు నేస్తం, ఏబీసీ నేస్తం, ఇళ్ళ పట్టాలు, ఇల్లు నిర్మాణం, దిశ యాప్ మహిళా పోలీస్ ఇవన్నీ గతంలో ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago