Pawan Kalyan – Nara Lokesh : పవన్ కళ్యాణ్ యాత్రకు, లోకేశ్ యాత్రకు ఏమైనా సంబంధం ఉందా..?
Pawan Kalyan – Nara Lokesh : జనసేనాని ఇటీవలే వారాహి యాత్రను ప్రారంభించారు. నారా లోకేశ్ మాత్రం ప్రారంభించి చాలా రోజులు అయింది. రెండు మూడు నెలలు అయింది. ఇప్పటికే దాదాపు చాలా కిలోమీటర్ల మేర నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. ఈయనది పాదయాత్ర అయితే.. పవన్ కళ్యాణ్ ది మాత్రం వారాహి యాత్ర. ఆయన పాదయాత్ర అయితే చేయడం లేదు. యువగళం యాత్రకు జనాదరణ మాత్రం అంతంతమాత్రమే అనుకోవాలి. కానీ.. పవన్ యాత్ర అలా కాదు. పవన్ కళ్యాన్ యాత్రకు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు.
సొంత కొడుకు యాత్రకు లేని ఆదరణ.. దత్త పుత్రుడి యాత్రకు బాగానే వస్తోంది. ఓవైపు పవన్ యాత్రకు రెస్పాన్స్ వస్తోందని చంద్రబాబు సంతోషించాలా లేక తన సొంత కొడుకు యాత్రకు ఆదరణ లేదని బాధపడాలో చంద్రబాబుకు అంతుపట్టడం లేదు. కానీ.. పవన్ యాత్రకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ సెటైర్లు వేస్తోంది. ఇదంతా పక్కన పెడితే అసలు టీడీపీ యాత్రకు ఆదరణ రావడం లేదు అనే అంశంపై ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.పచ్చ మీడియా నారా లోకేశ్ ను ఆకాశానికి ఎత్తుతోంది. రచ్చ రచ్చ చేస్తోంది. ఎంత పైకి ఎత్తినా కూడా ఆయన పాదయాత్రకు మాత్రం అంత ఆదరణ రావడం లేదు.
Pawan Kalyan – Nara Lokesh : లోకేశ్ ను ఎంత పైకి ఎత్తినా.. అంత లోతుకు జారిపోతున్నాడా?
అసలు జనం ఆ యాత్రనే పట్టించుకోవడం లేదు. కాకపోతే.. టీడీపీకి అంతో ఇంతో బలం ఉన్న నియోజకవర్గాల్లోనే కాస్తో కూస్తో జనాలు వస్తున్నారు. రాయలసీమ మొత్తం ఇన్ని రోజులు నారా లోకేశ్ పాదయాత్ర చేశారు. ఇక.. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. పవన్ నేరుగా గోదావరి జిల్లాలనే టార్గెట్ చేశారు. తన సామాజిక వర్గం కాపులు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలోనే ముందు పట్టుకున్నారు. అందుకే వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయింది. పవన్ సభల కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది కానీ.. లోకేశ్ యాత్ర చప్పగా ఉండటంతో టీడీపీ శ్రేణులు మాత్రం కొంచెం ఆసంతృప్తిగానే ఉన్నారు.