
Roja : రోజా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవరంటే..!
Roja : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఫలితాలు వచ్చినప్పటి నుండి టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడటంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వైఎస్సార్ విగ్రహాలను కూల్చేసి వాటి స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమలో కొందరిని అరెస్ట్ చేసి కూటమి నాయకులు జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అరాచకాలని బయటపెడతామంటూ కూటమి నాయకులు ప్రచారంలో చెప్పుకొచ్చారు.
అయితే అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే పదునైన మాటలతో ప్రత్యర్ధులని వణుకు పుట్టించే రోజా జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించింది. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డ్యాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.
Roja : రోజా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా.. ఆమెపై సీఐడీకి ఫిర్యాదు చేసిందెవరంటే..!
జగన్ కేబినెట్‌లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం – ఆంధ్ర, సీఎం కప్‌ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా – పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంపై సీఐడీకి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.రు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపై విచారణ జరపాలని నేతలు చెబుతున్నారు. చూస్తుంటే రోజా అరెస్ట్ ఖాయంగా కొందరు చెప్పుకొస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.