YS Sharmila : వైఎస్ షర్మిల ఎంట్రికి లైన్ క్లియర్.. తర్వలో ఏపీ కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు..!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలోకి వైయస్ షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల నుండి సమాచారం వెలబడుతుంది. అయితే మణిపూర్ లో పిసిసి అధ్యక్ష పదవిపై వైయస్ షర్మిలకు మల్లికార్జున కార్గే స్పష్టత ఇస్తుండగా …హై కమాండ్ ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కావాలనే గిడుగు రుద్రరాజు తో రాజీనామా చేపించి కాంగ్రెస్ ప్రభుత్వం షర్మిలకు లైన్ క్లియర్ చేసినట్లుగా అర్థమవుతుంది.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ను రేసులోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలను రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే ఢిల్లీలో ఏఐసిపి చీఫ్ మల్లికార్జున కార్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని హామీ ఇచ్చి ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని షర్మిల కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అయితే ఇన్ని రోజులు వరకు పిసిసి చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలోకి త్వరలోనే వైయస్ షర్మిలను నియమించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపడుతారని ప్రచారాలు సాగుతున్నాయి.
అయితే ప్రస్తుతం తన కుమారుడు పెళ్లి పనులలో చాలా బిజీగా ఉన్న షర్మిల వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈ పనులు ముగిసిన అనంతరం షర్మిల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలను పట్టుకుంటారని స్పష్టమవుతుంది..తన అన్నకు వ్యతిరేకంగా బరిలో దిగుతున్న షర్మిల కు , ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతారో వేచి చూడాల్సిందే. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్సిపి పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఉండగా తెలుగుదేశం మరియు జనసేన కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కి ప్రజలలో పెద్దగా ఆదరణ కూడా లేదు.ఈ క్రమంలో వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి బాధ్యతలు అప్పగించడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
This website uses cookies.