YS Sharmila : వైఎస్ ష‌ర్మిల ఎంట్రికి లైన్ క్లియ‌ర్‌.. త‌ర్వ‌లో ఏపీ కాంగ్రెస్ పీసీసీ ప‌గ్గాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : వైఎస్ ష‌ర్మిల ఎంట్రికి లైన్ క్లియ‌ర్‌.. త‌ర్వ‌లో ఏపీ కాంగ్రెస్ పీసీసీ ప‌గ్గాలు..!

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలోకి వైయస్ షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల నుండి సమాచారం వెలబడుతుంది. అయితే మణిపూర్ లో పిసిసి అధ్యక్ష పదవిపై వైయస్ షర్మిలకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 January 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : వైఎస్ ష‌ర్మిల ఎంట్రికి లైన్ క్లియ‌ర్‌.. త‌ర్వ‌లో ఏపీ కాంగ్రెస్ పీసీసీ ప‌గ్గాలు..!

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలోకి వైయస్ షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల నుండి సమాచారం వెలబడుతుంది. అయితే మణిపూర్ లో పిసిసి అధ్యక్ష పదవిపై వైయస్ షర్మిలకు మల్లికార్జున కార్గే స్పష్టత ఇస్తుండగా …హై కమాండ్ ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కావాలనే గిడుగు రుద్రరాజు తో రాజీనామా చేపించి కాంగ్రెస్ ప్రభుత్వం షర్మిలకు లైన్ క్లియర్ చేసినట్లుగా అర్థమవుతుంది.

అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ను రేసులోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలను రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే ఢిల్లీలో ఏఐసిపి చీఫ్ మల్లికార్జున కార్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని హామీ ఇచ్చి ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని షర్మిల కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అయితే ఇన్ని రోజులు వరకు పిసిసి చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలోకి త్వరలోనే వైయస్ షర్మిలను నియమించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపడుతారని ప్రచారాలు సాగుతున్నాయి.

అయితే ప్రస్తుతం తన కుమారుడు పెళ్లి పనులలో చాలా బిజీగా ఉన్న షర్మిల వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈ పనులు ముగిసిన అనంతరం షర్మిల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలను పట్టుకుంటారని స్పష్టమవుతుంది..తన అన్నకు వ్యతిరేకంగా బరిలో దిగుతున్న షర్మిల కు , ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతారో వేచి చూడాల్సిందే. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్సిపి పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఉండగా తెలుగుదేశం మరియు జనసేన కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కి ప్రజలలో పెద్దగా ఆదరణ కూడా లేదు.ఈ క్రమంలో వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి బాధ్యతలు అప్పగించడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది