Egg Fried Rice : యువకుడి ప్రాణం తీసిన ఎగ్ ఫ్రైడ్ రైస్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Egg Fried Rice : యువకుడి ప్రాణం తీసిన ఎగ్ ఫ్రైడ్ రైస్…!

 Authored By aruna | The Telugu News | Updated on :28 September 2023,2:00 pm

Egg Fried Rice : మన జీవితంలో ఎప్పుడు ఏ సంఘటన ఎలా జరుగుతుందో మనం ఊహించలేం.. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం.. కానీ మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మరణం సంభవిస్తుంది అంటే అది ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిన విషయమే.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఫుడ్ తిని ఒక వ్యక్తి మరణించాడు అంటే అది ఖచ్చితంగా మనందరం జాగ్రత్త పడాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు వెళుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. బయట ఫుడ్ ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు.. తిరుపతిలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న ఒక యువకుడు మరణించాడు. దీని వెనుక కారణాలేంటి? ఎగ్ ఫ్రైడ్ రైస్ అతని ప్రాణాలు ఎందుకు తీసింది.. అసలు ఫాస్ట్ ఫుడ్ మన జీవితాలతో ఎలా ఆడుకుంటుందో వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. పసుపు, మసాలా దినుసులు ఇలా ప్రతి ఒక్కదాంట్లో కల్తీ జరుగుతుంది.

లేదంటే నిలువ ఉంచిన ఆహార పదార్థాలను ఉపయోగించి ప్రజల ఆరోగ్యంతో ఎంతో మంది చెలగాటం ఆడుతున్నారు.. అధికారులు తనిఖీ చేసినప్పుడు ఇలాంటి తనిఖీలు అనేకం బయటపడుతున్నాయి.. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్తీ వ్యాపారాల వల్ల ఎంతో మంది అనారోగ్యాలకు గురవటమే కాదు.. ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్ లో పాలవుతున్నారు.. అనేకమంది మరణిస్తున్నారు కూడా తాజాగా ఇలాంటి ఒక సంఘటనే తిరుపతిలో జరిగింది. ఒక వ్యక్తి కల్తీ ఫుడ్ తిని మరణించాడు. తిరుపతి జిల్లాలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న యువకుడు స్వల్ప కాలంలోని అనారోగ్యానికి గురవటమే కాదు.. హాస్పటల్లో చేరిన తర్వాత చికిత్స పొందుతూ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న కారణంగా ఆ కల్తీ ఆహారం వల్ల తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వార్త స్థానికంగానే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హల్చల్ చేస్తుందని చెప్పచ్చు.. కలకలం రేపినటువంటి ఈ వార్త తిరుపతి జిల్లా కాలూరులో జరిగింది.

Egg fried rice that took the life of a young man

Egg fried rice that took the life of a young man

కాలూరులో 27 ఏళ్ల నరేంద్ర ఒక షాప్ లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు.. నరేంద్ర అయితే తిన్న వెంటనే ఇది గమనించిన తర్వాత తన కుటుంబ సభ్యులు నరేంద్రని వెంటనే తిరుపతిలోని ప్రియా హాస్పిటల్ కి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాటం చేసి పరిస్థితి విషమించి నరేంద్ర తన ప్రాణాలు వదిలాడు.. అయితే నరేంద్ర మరణం వెనుక ప్రధాన కారణం ఫుడ్ పాయిజనింగ్ అని వైద్యులు చెప్పారు.. నరేంద్ర తిన్నటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన షాపు మీద నరేంద్ర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీని అనుమానాస్పద మృతిగా కేస్ నమోదు చేశారు.

ఎక్స్ ఫ్రైడేస్ ఎక్కడైతే నరేంద్ర తిన్నాడో ఆ షాప్ లో పోలీసులు తనిఖీలు కూడా చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.. ఒక వ్యక్తి తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే కల్తీ ఆహార పదార్థాలు వీటి కోసం ఉపయోగించేటువంటి ప్రమాదం ఉంది. మాంసం బదులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని అనారోగ్య కరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి విధానాన్ని మనం అనేక రకాల అధికారులు చేసే దాడుల్లో చూస్తూనే ఉన్నాం.. కాబట్టి ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనానికి ఆరోగ్యకరమైన భోజనానికి మీ ప్రాధాన్యతను ఇవ్వండి…

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది