Ys Jagan : ఉద్యోగుల ఓట్లు ఆ పార్టీకే.. ఏపీలో కొనసాగుతున్న జగన్ హవా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : ఉద్యోగుల ఓట్లు ఆ పార్టీకే.. ఏపీలో కొనసాగుతున్న జగన్ హవా..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : ఉద్యోగుల ఓట్లు ఆ పార్టీకే.. ఏపీలో కొనసాగుతున్న జగన్ హవా..!

Ys Jagan : ఏపీలో ఎన్నికల సమరం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. ఓ వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ ఒక్క వైసీపీ మాత్రమే సింగిల్ గా బరిలో నిలుస్తోంది. కేవలం వైసీపీ మీదనే అన్ని పార్టీల కలిసి పోటీకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని అందరూఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా సర్వేలు జగన్ కే అధికారం దక్కుతుందని తేల్చి చెప్పేశాయి.

Ys Jagan చంద్రబాబు అవమానం..

Ys Jagan : ఈ క్రమంలోనే ఉద్యోగులు ఎటువైపు నిలుస్తారనేది అందరిలోనూ ఉంది. మొన్న శనివారం నుంచే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల ఓట్లు ఎటువైపు అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే మెజార్టీ ఉద్యోగులు మాత్రం జగన్ నడిపిస్తున్న వైసీపీకే ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఉద్యోగులను అవమానించిన తీరు వారికి ఇంకా గుర్తుకుంది. ఉద్యోగులకు భారీ జీతాలు ఎందుకు అంటూ గతంలో చంద్రబాబు హేళనగా మాట్లాడారు. అవి ఇంకా వారికి గుర్తుకున్నాయి కాబోలు. దాంతో పాటు జగన్ తీసుకొచ్చిన జీపీఎస్ విధానం తమకు మేలు చేస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.దాంతో పాటు వారి జీతాలు ఒకటో తారీకున ఇవ్వడం కూడా వారికి ముఖ్యమే.

Ys Jagan ఉద్యోగుల ఓట్లు ఆ పార్టీకే ఏపీలో కొనసాగుతున్న జగన్ హవా

Ys Jagan : ఉద్యోగుల ఓట్లు ఆ పార్టీకే.. ఏపీలో కొనసాగుతున్న జగన్ హవా..!

ఎందుకంటే సమయానికి జీతాలు ఇవ్వకపోతే వారికి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోను, ఆయన ఇస్తున్న హామీలను చూస్తే వాటిని అమలు చేసేందుకు ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదని వారు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో రాష్ట్ర అప్పులు బాగా పెరిగిపోతే జీతాలు ఇవ్వడం ఇబ్బందికరంగా మారుతుందని వారు తెలుసుకుంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడును గెలిపిస్తే తమకు సమయానికి జీతాలిస్తారో లేదో అనే భయం వారిలో ఉంది.దానికి తోడు చంద్రబాబు సీఎం అయితే అనవసర మీటింగుల పేరుతో తమను ఇబ్బంది పెడుతారని వారు గుర్తుకు తెస్తున్నారు. ఎనిమిది గంట పని విధానం ఉన్నా..అంతకన్నా ఎక్కువ పని చేయించుకుంటారనే కారణాలతో వైసీపీవైపే వారు మొగ్గు చూపుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది