
Election Money : ట్రెండింగ్.. మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు అనే ప్రశ్న.. విచిత్రంగా ఉందిగా !
Election Money : మే 11 సాయంత్రం 6గంటలతో ప్రచారానికి పులిస్టాప్ పడింది. అన్ని మైకులు మూగబోయాయి. నాయకులు చల్లపడ్డారు. తమవంతు ప్రచారాలు చేశారు. గెలిపించడం, ఓడించడం ఓటర్లకి వదిలేసారు. అయితే ఎన్నికలు అత్యంత కాస్ట్‌లీగా మారాయి. అందులో ఓట్ల కొనుగోలు అనేది ఓ పెద్ద ప్రక్రియ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అనే పేరు పెట్టుకోవడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రక్రియ జోరు మీద సాగింది. నిజానికి ప్రచారం ముగిసిన రోజు రాత్రి గతంలో డబ్బుల పంపిణీ పూర్తి చేసేవారు. ఈ సారి అలా లేదు. మూడు రోజుల ముందు నుంచే బూత్‌ల వారీగా డబ్బులు పంపకాలు చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తడా లేకుండా అన్ని పార్టీలు అందరికీ పంపిణీ చేయడమే ఈ సారి ఏపీ ఎన్నికల్లో కీలకం. ఓ రకంగా ఇది లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని తీసుకువచ్చిందని అనుకోవచ్చు. కానీ ఓటుకు నోటు అనేది నేరం. దీన్ని ఈసీ ఎందుకు ఆపలేకపోతోందనేది కీలకంగా మారింది.
ఇప్పటికే చాలామంది నేతలు తమ నియోజకవర్గాలలో కూడా ప్రజలకు డబ్బు పంచడం జరిగింది.. అయితే ఈ డబ్బు పంపిన విషయంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ కి డబ్బులు పంచడం కోసం పార్టీలు కొన్ని డైరెక్ట్ గా పంపించాయి..ఎంపీ కాండేట్లు కూడా మరి కొంతమంది డబ్బులను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులను తాకట్టు పెట్టి మరి ప్రజలకు డబ్బు పంచుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లోకి పంపించినప్పుడు ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట ఏమిటంటే.. వైసీపీ కానీ టిడిపి పార్టీ కానీ ఒక్కో ఓటుకు 2000 పంచాలనుకున్నారట.. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం ఓటుకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారట.
Election Money : ట్రెండింగ్.. మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు అనే ప్రశ్న.. విచిత్రంగా ఉందిగా !
అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్థానిక నాయకులు తమకు ఇన్ని రోజులు ఖర్చయింది కదా అంటూ.. అందులో కొంత మొత్తాన్ని అక్కడి నేతలే పంచుకుంటున్నారు. ఇక డబ్బులు పంపిణీ కార్యక్రమంతో మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు అనే ప్రశ్న. గత కొద్ది రోజులుగా ఏ ఇద్దరు కూర్చొని మాట్లాడిన రాజకీయం గురించే. ఎవరు గెలుస్తారు. పార్టీ తరపున ఎంత డబ్బు ఇస్తారు వంటి వాటి గురించే చర్చ. అయితే ఎలక్షన్ ప్రచారం ముగియడంతో డబ్బులు పంచుతారని భావిస్తున్న ఓటర్లు ఏ పార్టీ ఎంత ఇస్తుంది, ఎక్కడ ఎంత పంచుతున్నారు అనే దాని గురించి చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు అనే ప్రశ్న ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.