Election Money : ట్రెండింగ్‌.. మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న‌.. విచిత్రంగా ఉందిగా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Election Money : ట్రెండింగ్‌..  మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న‌.. విచిత్రంగా ఉందిగా !

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2024,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Election Money : ట్రెండింగ్‌..  మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న‌.. విచిత్రంగా ఉందిగా !

Election Money : మే 11 సాయంత్రం 6గంట‌ల‌తో ప్ర‌చారానికి పులిస్టాప్ ప‌డింది. అన్ని మైకులు మూగ‌బోయాయి. నాయ‌కులు చ‌ల్ల‌ప‌డ్డారు. త‌మవంతు ప్ర‌చారాలు చేశారు. గెలిపించ‌డం, ఓడించడం ఓట‌ర్లకి వదిలేసారు. అయితే ఎన్నికలు అత్యంత కాస్ట్‌లీగా మారాయి. అందులో ఓట్ల కొనుగోలు అనేది ఓ పెద్ద ప్రక్రియ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అనే పేరు పెట్టుకోవ‌డం విశేషం. ఈ సారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రక్రియ జోరు మీద సాగింది. నిజానికి ప్రచారం ముగిసిన రోజు రాత్రి గతంలో డబ్బుల పంపిణీ పూర్తి చేసేవారు. ఈ సారి అలా లేదు. మూడు రోజుల ముందు నుంచే బూత్‌ల వారీగా డబ్బులు పంపకాలు చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తడా లేకుండా అన్ని పార్టీలు అందరికీ పంపిణీ చేయడమే ఈ సారి ఏపీ ఎన్నికల్లో కీలకం. ఓ రకంగా ఇది లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని తీసుకువచ్చిందని అనుకోవచ్చు. కానీ ఓటుకు నోటు అనేది నేరం. దీన్ని ఈసీ ఎందుకు ఆపలేకపోతోందనేది కీలకంగా మారింది.

Election Money డ‌బ్బు కోసం ఎదురుచూపు..

ఇప్పటికే చాలామంది నేతలు తమ నియోజకవర్గాలలో కూడా ప్రజలకు డబ్బు పంచడం జరిగింది.. అయితే ఈ డబ్బు పంపిన విషయంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ కి డబ్బులు పంచడం కోసం పార్టీలు కొన్ని డైరెక్ట్ గా పంపించాయి..ఎంపీ కాండేట్లు కూడా మరి కొంతమంది డబ్బులను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులను తాకట్టు పెట్టి మరి ప్రజలకు డబ్బు పంచుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లోకి పంపించినప్పుడు ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట ఏమిటంటే.. వైసీపీ కానీ టిడిపి పార్టీ కానీ ఒక్కో ఓటుకు 2000 పంచాలనుకున్నారట.. చాలా చోట్ల కూడా ఇదే జరుగుతోంది. అయితే కొంతమంది మాత్రం ఓటుకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారట.

Election Money ట్రెండింగ్‌ మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న‌ విచిత్రంగా ఉందిగా

Election Money : ట్రెండింగ్‌..  మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న‌.. విచిత్రంగా ఉందిగా !

అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్థానిక నాయకులు తమకు ఇన్ని రోజులు ఖర్చయింది కదా అంటూ.. అందులో కొంత మొత్తాన్ని అక్కడి నేతలే పంచుకుంటున్నారు. ఇక డ‌బ్బులు పంపిణీ కార్య‌క్ర‌మంతో మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న‌. గ‌త కొద్ది రోజులుగా ఏ ఇద్ద‌రు కూర్చొని మాట్లాడిన రాజ‌కీయం గురించే. ఎవ‌రు గెలుస్తారు. పార్టీ త‌ర‌పున ఎంత డ‌బ్బు ఇస్తారు వంటి వాటి గురించే చ‌ర్చ‌. అయితే ఎల‌క్ష‌న్ ప్ర‌చారం ముగియ‌డంతో డ‌బ్బులు పంచుతార‌ని భావిస్తున్న ఓట‌ర్లు ఏ పార్టీ ఎంత ఇస్తుంది, ఎక్క‌డ ఎంత పంచుతున్నారు అనే దాని గురించి చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మీ ఊరిలో ఎవ‌రు ఎంతిస్తున్నారు అనే ప్ర‌శ్న ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది