
RK Roja : రోజాని వైసీపీ పక్కన పెట్టిందా.. పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటుందా ?
RK Roja : రోజా ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. ఆమె వైసీపీలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఓటమి తర్వాత రోజా పరిస్థితి దారుణంగా మారింది. ఆమె కనిపించకుండా పోయింది. రోజా ఎక్కడ? ఇంతకీ ఆమె ఏపీలో ఉన్నారా? లేక చెన్నైకి షిఫ్ట్ అయ్యారా? అధినేత విజయవాడకు వచ్చినా ఎందుకు కలవలేదు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? ఇంతకీ ఏ పార్టీ వైపు చూస్తున్నారు? బీజేపీ, జనసేన లేకుంటే మరేదైనా పార్టీలోకి వెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. గడిచిన పదేళ్లు వైసీపీ నేత, మాజీ మంత్రి, నటి రోజాకు స్వర్ణయుగం. వైపీసీ విపక్షంలో ఉన్నప్పుడు.. అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యేవారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండునెలలు గడిచిపోయాయి. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పలుమార్లు జగన్ మీడియా ముందుకు రావడం జరిగింది. కనీసం అధినేతను సైతం కలవలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు మాజీ మంత్రి రోజా. కారణాలు ఏమైనా అనుకోండి. ఆమె సైలెంట్‌గా ఉండటాన్ని గమనించిన ఆ పార్టీ నేతలు.. రోజా పార్టీ మారే అవకాశముందని చర్చించుకోవడం మొదలైంది. జగన్‌కు మాజీ మంత్రి రోజా బైబై చెప్పి.. తమిళ రాజకీయాల్లో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తు్న్న మాట. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం.. టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు.
RK Roja : రోజాని వైసీపీ పక్కన పెట్టిందా.. పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటుందా ?
ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్. ఆమె భర్త సెవ్వమణి తమిళ సినీ దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని.. అక్కడకు మాకాం మార్చుకునే పనిలో ఉన్నారని తెలియవచ్చింది. రోజా.. తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. పైగా ఆమె భర్త సొంతూరు కూడా తమిళనాడు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగుపెట్టాలని ఆలోచన చేస్తోందట. మరి తమిళతంబీలు ఈమెని ఆకట్టుకుంటారా? అన్నదే అసలు పాయింట్. అయితే రోజాని కూడా పార్టీ పక్కన పెట్టేసిందనే టాక్ ఒకటి నడుస్తుంది. దీనిపై క్లారిటీ అయితే రావలసి ఉంది.
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…
Cricketer | భారత క్రికెట్లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్కప్ ఫైనల్కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
This website uses cookies.