Exit Polls : జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్.. వార్ వన్ సైడ్ అయినట్టేనా?
Exit Polls : ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు పదవి చేజిక్కించుకుంటారు అనేది జూన్ 4న తేలనుంది. అయితే అంతకన్నా ముందే ఎవరెవరు అధికారాన్ని దక్కించుకుంటారు అనే దానిపై విశ్లేషణ చేస్తున్నారు. జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. హోరా హోరీ పోరు సాగటం.. గెలుపు పై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో అంచనాల పై స్పష్టత రావటం లేదు. ఈ క్రమంలోనే జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్దమయ్యాయి.
ఈ సారి టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు సాగింది. పోలింగ్ సరళి పైన రెండు వైపులా క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి లో సమీక్షజరిగింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్దులు గెలుపు, ఓటముల పైన ఒక అంచనాకు వచ్చారు.. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఆ తరువాత జగన్ ఐప్యాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేసారు. జగన్ కు ఐప్యాక్ తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో మూడు సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కల పైన పూర్తిగా కసరత్తు చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేసారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా..తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పటం లేదు.
Exit Polls : జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్.. వార్ వన్ సైడ్ అయినట్టేనా?
అయితే, మహిళా ఓట్ బ్యాంక్…పెరిగిన రెండు శాతం ఓటింగ్ లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదుల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది.అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత..పలు వర్గాల్లో ఉన్నఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఈ సారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఓటరు పల్స్ తెలుసకోవటం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే, ప్రతీ ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ ఒన సైడ్ గానే జరిగిందని నిర్దారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.