Exit Polls : జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్.. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Exit Polls : జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్.. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టేనా?

 Authored By ramu | The Telugu News | Updated on :30 May 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Exit Polls : జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్.. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టేనా?

Exit Polls : ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఇప్పుడు అంద‌రి దృష్టి పడింది. ఈ సారి ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు, ఎవ‌రు ప‌దవి చేజిక్కించుకుంటారు అనేది జూన్ 4న తేల‌నుంది. అయితే అంత‌కన్నా ముందే ఎవ‌రెవ‌రు అధికారాన్ని ద‌క్కించుకుంటారు అనే దానిపై విశ్లేష‌ణ చేస్తున్నారు. జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. హోరా హోరీ పోరు సాగటం.. గెలుపు పై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో అంచనాల పై స్పష్టత రావటం లేదు. ఈ క్రమంలోనే జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్దమయ్యాయి.

Exit Polls టెన్ష‌న్.. టెన్ష‌న్

ఈ సారి టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు సాగింది. పోలింగ్ సరళి పైన రెండు వైపులా క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి లో సమీక్షజరిగింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్దులు గెలుపు, ఓటముల పైన ఒక అంచనాకు వచ్చారు.. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఆ తరువాత జగన్ ఐప్యాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేసారు. జగన్ కు ఐప్యాక్ తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో మూడు సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్న లెక్కల పైన పూర్తిగా కసరత్తు చేసిన తరువాతనే జగన్ ఈ ప్రకటన చేసారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా..తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ముఖ్యులు చెప్పటం లేదు.

Exit Polls జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్ వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టేనా

Exit Polls : జూన్ 1న రానున్న ఎగ్జిట్ పోల్స్.. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టేనా?

అయితే, మహిళా ఓట్ బ్యాంక్…పెరిగిన రెండు శాతం ఓటింగ్ లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదుల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది.అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత..పలు వర్గాల్లో ఉన్నఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఈ సారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఓటరు పల్స్ తెలుసకోవటం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే, ప్రతీ ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన రెండు సంస్థలు మాత్రం ఏపీలో వార్ ఒన సైడ్ గానే జరిగిందని నిర్దారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది