Ysrcp : కాసేపట్లో జగన్ ని కలవబోతున్న అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. వైసీపీలోకి ఎంట్రీ..!
Ysrcp : కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ వైసీపీ లోకి వెళ్ళిపోయారు. చాలా తెలివిగా మీడియాను ఎట్రాక్ట్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. కేశినేని నానికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.ప్రజల్లో చులకన అయ్యే మాటలు మాట్లాడరు.కేశినేని నానిపై అవినీతి ఆరోపణలు కూడా లేవు. కాబట్టి కేశినేని నాని వైసీపీలోకి చేరడం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి పెద్ద ప్లస్ పాయింట్. వైసీపీలో పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి మాస్ లీడర్స్ ఉన్నారు. […]
ప్రధానాంశాలు:
Ysrcp : కాసేపట్లో జగన్ ని కలవబోతున్న అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. వైసీపీలోకి ఎంట్రీ..!
Ysrcp : కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ వైసీపీ లోకి వెళ్ళిపోయారు. చాలా తెలివిగా మీడియాను ఎట్రాక్ట్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. కేశినేని నానికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.ప్రజల్లో చులకన అయ్యే మాటలు మాట్లాడరు.కేశినేని నానిపై అవినీతి ఆరోపణలు కూడా లేవు. కాబట్టి కేశినేని నాని వైసీపీలోకి చేరడం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి పెద్ద ప్లస్ పాయింట్. వైసీపీలో పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి మాస్ లీడర్స్ ఉన్నారు. కానీ కేశినేని నాని మాట్లాడే తీరు అందరికీ పాజిటివ్గా అనిపిస్తుంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా కొన్నిసార్లు పరిధికి మించి వేరే వారి భార్యల గురించి పెళ్లిళ్ల గురించి పనికిమాలిన విషయాలు మాట్లాడిన సందర్భం ఉంది. అలాంటి సమయంలో ఇలాంటి ప్రొఫెషనల్ వ్యక్తి కేశినేని నాని వైసీపీలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రొఫెషనల్ వ్యక్తిని కీలకమైన వ్యక్తిని పార్టీలోకి తీసుకుపోతున్నట్లు సమాచారం. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ చివరిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం ప్రచారం అవుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించలేదు. వైసీపీ వ్యక్తి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాజాగా గల్లా జయదేవ్ ను కలవడం జరిగింది. త్వరలోనే గల్లా జయదేవ్ జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే విజయవాడ ఎంపీ ని కోల్పోయిన టీడీపీకి గుంటూరు ఎంపీ ని కూడా కోల్పోతే చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది.
గల్లా జయదేవ్ కు కేశినేని నాని లాగా ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ప్రొఫెషనల్ రాజకీయుడు. గల్లా జయదేవ్ కు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. పెద్ద పారిశ్రామికవేత్త. వైయస్ జగన్మోహన్ రెడ్డి గల్లా జయదేవ్ ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఆయన మళ్ళీ వైసీపీలోకి చేరుతున్నారు. ఆయన పార్టీలోకి వస్తే ఏ పదవి కోరుతారు..జగన్ అతడిని ఎలా స్వీకరిస్తారు..చంద్రబాబు నాయుడు దీనిని ఎలా తట్టుకోగలుగుతారని అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గల్లా జయదేవ్ వైసీపీలో కూడా ప్రొఫెషనల్ రాజకీయాలను చేస్తే వైసీపీకి మంచి అవుతుంది. అది చంద్రబాబు నాయుడుకి పెద్ద దెబ్బ పడుతుంది. చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తీసుకొస్తున్న అని చెబుతున్నప్పుడు గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తను కాపాడుకోలేకపోతే చంద్రబాబుపై అపవాదన వస్తుంది. ఇదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడుకి పెద్ద దెబ్బ పడుతుంది.