AP New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం.. ఎవరికీ ఇవ్వబోతున్నారంటే!!
ప్రధానాంశాలు:
AP New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం.. ఎవరికీ ఇవ్వబోతున్నారంటే!!
AP New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తను కోల్పోయిన వితంతువులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 89,788 వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పెన్షన్లను మే 1వ తేదీ నుండి లబ్ధిదారులకు అందించనున్నారు. కొత్తగా దరఖాస్తు చేసిన వారు జూన్ 1వ తేదీ నుండి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. వితంతు కేటగిరీలో తప్పకుండా అర్హులు మాత్రమే లబ్ధిదారుల జాబితాలోకి చేరేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది.

AP New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం.. ఎవరికీ ఇవ్వబోతున్నారంటే!!
AP New Pensioners పెన్షన్ విధానంలో మార్పులు
పెన్షన్ మంజూరులో అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో అనేక బోగస్ ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు గుర్తించి, వాటిపై ఇప్పటికే రీ-అసెస్‌మెంట్ ప్రక్రియ మొదలుపెట్టారు. స్పౌజ్ పెన్షన్ కోసం దరఖాస్తులను వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా స్వీకరిస్తారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసిన వారికి మే 1న పెన్షన్ డబ్బులు అందనుండగా, మిగిలిన వారికి జూన్ 1 నుండి చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఈ చర్యతో ప్రభుత్వంపై రూ. 35.91 కోట్ల అదనపు భారం పడనుంది.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా పెన్షన్ల మంజూరు జరిగేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి, ఆరు నెలలకు ఒకసారి మాత్రమే పెన్షన్ల జాబితా సిద్ధం చేసే విధానంకి మారింది. దీంతో అనేక అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఆలస్యమైంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో పెన్షన్ నిలిచిపోయిన వారికి మళ్ళీ అవకాశాలు లభించనున్నాయి. అలాగే జులై నెల నుంచి కొత్తగా ఇతర కేటగిరీల కింద దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది. కొత్తగా 6 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా. ఇది పేదల జీవితాలలో ఆర్థిక స్థిరత తీసుకురానుంది.