TTD Good News : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో ఏఐ అధారిత సేవలు..!
ప్రధానాంశాలు:
TTD Good News : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో ఏఐ అధారిత సేవలు..!
Good News : తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు టీటీడీ ( తిరుమల తిరుపతి దేవస్థానము) సాంకేతికతను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి భక్తుడికి శాశ్వత ఐడీని కేటాయించి, దర్శనం, వసతి, సేవల బుకింగ్ వంటి వ్యవహారాలను ఆ ఐడీ ఆధారంగా నిర్వహించనున్నారు. ఇందుకు గూగుల్ సంస్థతో టీటీడీ ఒప్పందానికి సిద్ధమవుతోంది.

TTD Good News : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో ఏఐ అధారిత సేవలు..!
తిరుమలలో ఇప్పటికే జియో సంస్థ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ చిత్ర గుర్తింపు) ద్వారా భక్తుల వివరాలను నమోదు చేస్తోంది. ఇప్పుడు దీన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నారు. ప్రతి కంపార్ట్‌మెంట్ వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కెమెరాల సహాయంతో అనుమానితులను గుర్తించి, భద్రతా సిబ్బంది చర్యలు తీసుకునే వీలుంటుంది. అదే విధంగా దళారుల వల్ల ఏర్పడే సమస్యలను అరికట్టేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడనుంది.
భవిష్యత్‌లో భక్తుల సంఖ్య అధికంగా ఉండే సమయంలో ముందుగానే టీటీడీకి సమాచారం అందడం వల్ల ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. దర్శన విధానం, వస్త్రధారణ నియమాలు, స్థానిక సంప్రదాయాలపై భక్తులకు వారి భాషలో సమాచారం అందించనున్నారు. అంతర్జాతీయంగా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఈ సేవలు విస్తృతంగా ఉపయోగపడతాయి. భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలను సాంకేతికంగా సేకరించి సేవల నాణ్యతను మెరుగుపరచేందుకు టీటీడీ ముందడుగు వేసింది.